ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ పోటీలు

Feb 11 2026 7:19 AM | Updated on Feb 11 2026 7:19 AM

ఉత్సా

ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ పోటీలు

ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ పోటీలు

జయపురం: సంబాద్‌ దినపత్రిక గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో గుర్తింపు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమని కొరాపుట్‌ కేంద్ర సహకార బ్యాంక్‌ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పట్నాయిక్‌ అన్నారు. సంబాద్‌, డిజిటల్‌ ఎడిషన్‌ జయపురం స్థానిక డీపీ అకాడమీ స్టేడియంలో నిర్వహించిన మెగా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ బహుమతి ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జయపురంలో ఇండోర్‌ స్టేడియం నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రణాళికల విభాగ డిప్యూటీ డైరెక్టర్‌ సూర్యకాంత బెహరా ప్రారంభించిన ఈ పోటీలలో కొరాపుట్‌, రాయగడ, మల్కన్‌గిరి, నవరంగపూర్‌ జిల్లాల నుంచి 86 టీమ్‌లకు చెందిన 172 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. బహుమతి ప్రదానోత్సవానికి సంబాద్‌ జయపురం ఎడిషన్‌ చీఫ్‌ నవీన్‌ చంద్ర సాహు అధ్యక్షత వహించారు. 15 ఏళ్ల వయసు లోపు బాలుర డబుల్స్‌లో సాయిశ్రీ శతపతి, శౌమ్య పాఢీ లు చాంపియన్‌లుగా నిలిచారు. 15 ఏళ్ల లోపు బాలికల గ్రూపులో డబుల్సు లో నితేష్‌ పట్నాయిక్‌,మహమ్మద్‌ అరజిరాజ,లు, పురుషుల డబుల్స్‌లో శ్మితరంజన్‌ తంబ,అభినాష్‌ పంగిలు, 80 ఏళ్ల వయసు లోపు గ్రూపులో సిద్దార్ధ నాయిక్‌, అశోక్‌ బెహర, 70 ఏళ్ల గ్రూపు లో కన్హూ పట్నాయిక్‌, సిద్దార్ధ నాయిక్‌ చాంపియన్‌లుగా నిలిచారు.

ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ పోటీలు1
1/2

ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ పోటీలు

ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ పోటీలు2
2/2

ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement