డీఈఓకు అవార్డు ప్రదానం
పర్లాకిమిడి: రాష్ట్ర స్థాయిలో గజపతి జిల్లా విద్యాశాఖకు ‘స్టెమ్ ఎక్స్‌లేన్సీ’ అవార్డును భువనేశ్వర్‌లో ఖాన్ అకాడమీ ద్వారా జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహును ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేశారు. రాష్ట్ర స్థాయిలో అత్యధిక ఫస్ట్ క్లాస్‌లు సాధించి, టెన్త్ బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఆయనను అభినందిస్తూ ఖాన్ అకాడమీ ప్రిన్సిపాల్ గాయత్రీ పట్నాయక్ ఎక్స్‌లెన్సీ అవార్డును సోమవారం అందజేశారు. స్టెమ్ ఎక్స్‌లెన్సీ ప్రోగ్రాం ద్వారా మోహన్‌కుమార్ నాయక్, గుంపు ఈశ్వరరావు టీచర్ లెర్నింగ్ కోర్సులు అభ్యసించి వాటిని జిల్లాలోని ఇతర ఉపాధ్యాయులకు తెలియజేయడం ద్వారా గజపతి జిల్లాలో విద్యార్థులు గత విద్యా సంవంత్సరంలో మంచి విజయాలు సాధించారన్నారు. ఫిబ్రవరి 19వ తేదీన జరుగనున్న ఒడిశా టెన్త్ బోర్డు పరీక్షల్లో కూడా గజపతిజిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని గాయత్రి పట్నాయక్ కోరారు. జిల్లాలో ఉన్నత పాఠశాలల్లో ఖరడ పి.ఎం.శ్రీ బి.ఎం.ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మోహన్‌రావుకి ఈ సందర్భంగా ఖాన్ అకాడమీ ప్రత్యేక అవార్డును ఇచ్చి సత్కరించింది.
‘వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి’
జలుమూరు: పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, దీని కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని డీఈఓ ఎ.రవిబాబు అన్నారు. మంగళవారం లింగాలవలస ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. టీచర్లు విద్యార్థులను గమనించి ఏ అంశంలో వెనుకబడ్డారో అందులో సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం పథ కం పరిశీలించారు.
‘ఏయూ డిస్టెన్స్ సెంటర్ కొనసాగించాలి’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ సెంటర్‌ను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ స్టడీ సెంటర్ వద్ద విద్యార్థు లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు, పి.ఖగేష్‌లు మాట్లాడుతూ ఏయూ డిస్టెన్స్‌లో చదివే విద్యార్థులు క్లాసులకు వెళ్లగా, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ వైజాగ్ ట్రాన్స్‌ఫర్ చేశారని, కొత్తగా ఎవరిని ఇక్కడికి అలాట్ చేయలేదని, విద్యార్థుల కోసం సపోర్టింగ్ స్టాఫ్ ఎవరూ లేరని చెప్పడం దారుణమన్నారు. 2025– 2026లో 1500 మందికి పైగా విద్యార్థులు ఈ సెంటర్ ద్వారా అడ్మిషన్ తీసుకున్నారని, ఇప్పుడు సడన్‌గా ఈ హెల్ప్ సెంటర్ మూసివేయడం వల్ల వీరికి ఇబ్బంది ఎదురవుతుందన్నారు.
డీఈఓకు అవార్డు ప్రదానం


