ధాన్యం బస్తాల స్వాధీనం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో పలు ధాన్యం మండీల్లో జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ గురువారం ఓ ప్రత్యేక బృందాన్ని పంపించారు. సరఫరాశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ వెళ్లి పరిశీలించారు. కొంతమంది వ్యాపారులు ధాన్యాన్ని ఒక చోటు నుంచి మరోక చోటుకు తరలిస్తున్నాని తెలుసుకొని దాడులు చేపట్టారు. బడలి పంచాయతీలో పరిధిలో ఒక ప్రైవేట్ గోదాంలో ప్రశాంత్ అనే వ్యక్తి నిల్వ ఉంచిన 200 క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మాన్యంకొండ ప్రాంతాంలో ట్రాక్టర్‌తో 40 క్వింటాళ్లు, గొంపకొండ ప్రాంతంలో రెండు వ్యాన్లలో సుమారు 80 క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని కలిమెల పోలీసు స్టేషన్‌కు తరలించారు, డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.
ధాన్యం బస్తాల స్వాధీనం
ధాన్యం బస్తాల స్వాధీనం


