కేంద్ర బడ్జెట్‌పై అవగాహన
జయపురం: స్థానిక ఓ హోటల్‌లో జయపురం జాగరణ మంచ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన 2026–27 బడ్జెట్‌పై అవగాహన కల్పించారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో అఖిల భారత సంఘర్ష్ వాహిణీ ప్రముఖులు, ఇంజినీర్ అన్యదా శంకర్ పాణిగ్రహి ముఖ్యఅతిథిగా పాల్గొని పలు అంశాలను వివరించారు. గోమాత సంరక్షణకు ప్రత్యేక పథకాలు బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. స్వదేశీ భారత్. సమృద్ధి భారత్ నిర్మాణం కోసం తగిన ప్రాధాన్యత కల్పించారని కొనియాడారు. ముఖ్యంగా స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తగిన పథకాలు రూపొందించాల్సి ఉందన్నారు. మధ్య తరగతి కుటుంబాలకు ఆదాయపు పన్ను రాయితీలు కల్పించారన్నారు. స్వదేశీ ఉత్పత్తులు ప్రజలు వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు స్వదేశీ ఉత్పత్తు వినియోగించిన నాడే దేశ ఆర్థిక ప్రగతి అని, నేడు దేశంలో ప్రతి ఇంటిలోనూ విదేశీ వస్తువులు ఉంటున్నాయన్నారు. దేశాన్ని ఆర్థికంగా, సమృద్ధిగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒడిశా ప్రొఫెసర్ డాక్టర్ సీతానాథ్ రాయగురు, స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర సహాయకో ఆర్డినేటర్ మనోరంజన్ రౌత్‌రాయ్, చార్టెడ్ అకౌంటెంట్ రవి శంకర్, పట్టణంలో ప్రముఖ వ్యాపార వేత్త సంజయ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొని బడ్జెట్‌పై అభిప్రాయాలను వెల్లడించారు.


