గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి
రణస్థలం: లావేరు మండలం బుడతవలస గ్రామ సచివాలయ విలేజ్ సర్వేయర్ పొట్నూరు రఘునాథ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. ఈయన శుక్రవారం జిల్లా పరిషత్‌లో జరిగిన జాయింట్ ఎల్‌పీఎం మీటింగ్‌కు హాజరయ్యారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఈయనకు భార్య వరలక్ష్మి, కుమారె, కుమారుడు ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వేయర్ జోషిల, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వెంకటేశ్వరరావు, లావేరు తహసీల్దార్ జీఎల్‌వీ శ్రీనివాసరావు మృతదేహానికి నివాళి అర్పించారు.


