కొనాబాయిలో అగ్ని ప్రమాదం
● ఎనిమిది పూరిళ్లు దగ్ధం
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధి కొనాబాయి గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. విలువైన పత్రాలు , డబ్బులు, పత్తి, రాగులు తదితరమైనవి కాలి బూడిదైనట్లు గుర్తించారు. మధ్యాహ్నం కొనాబాయిలోని మానిక్ హుయికకు చెందిన ఇంట్లో తొలుత మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న మిగతా ఇళ్లకు వ్యాపించాయి. గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అయితే సిబ్బంది వచ్చేలోగానే ఇళ్లు కాలిపొయాయి. తరువాత నిప్పులను ఆర్పివేశారు.


