పోడియా పోలీస్‌స్టేషన్ ఐఐసీ బాధ్యతల స్వీకరణ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితిలో నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్‌కు ఐఐసీగా నియమితులైన సంతోష్ కుమార్ మాఝి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ ఈయన నవరంగ్‌పూర్ జిల్లా పాపడాహండి పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా సేవలు అందించి పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా పోడియ సమితి పాత్రికేయుల బృందం ఐఐసీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. అనంతరం ఐఐసీ సంతోష్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలు ఉంటే తమ సిబ్బంది దృష్టికి తీసుకురావాలన్నారు.
మావోలు లొంగిపోవాలి
● తోటి మావోయిస్టులకు నిఖిల్
వీడియో సందేశం
రాయగడ: ప్రభుత్వం ఆదరిస్తుంది. ఆయుధాలు వీడి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఇటీవల పోలీసుల ఎదుట తమ సహచరులతో కలిసి లొంగిపోయిన ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు, మావొ నేత నిఖిల్ రౌత్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో తన మాజీ సహచరులకు విన్నవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుధాలతో ఎలాంటి ప్రయోజనం లేదని, ఆదివారం నాడు విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. తాను కూడా ఆ బాటను వీడి ఆయుధాలతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపొయానని మిత్రులంతా కూడా ఇదే బాటను అవలంబించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లొంగిపొయిన మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించడంతో పాటు జీవనోపాధిమార్గాలను కూడా కల్పిస్తుందని వివరించారు. రాజ్యాంబ బద్ధంగా పోరాడాలే తప్ప కొండల్లో ఉంటూ ఆయుధాలతో చేసేదేమీ లేదని పేర్కొన్నారు. మిత్రులు ఎవరైనా లొంగిపోవాలని అనుకుంటే 9437643839 నంబరుకు సంప్రదిస్తే తాను సహకరిస్తానని ప్రకటించారు.
పోడియా పోలీస్‌స్టేషన్ ఐఐసీ బాధ్యతల స్వీకరణ


