సర్వేలతో చచ్చిపోతున్నాం..!
గతమెంతో ఘనం...
● భారం మోయలేకపోతున్నామని సచివాలయ ఉద్యోగుల ఆవేదన
● ఏకంగా 32 రకాల సర్వేల నిర్వహణలో బిజిబిజీ
● పనిఒత్తిడితో ఇప్పటికే పలువురి ఆత్మహత్య
అరసవల్లి:
‘‘సచివాలయాలు శుద్ధ దండగ.. అసలు వాళ్లు ఉద్యోగులేనా.. ఎందుకూ పనికిరారు..’’ ఇవీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు
‘‘సచివాలయాలు దరిద్రాలయాలు..’ ఇవీ స్థానిక కూటమి ప్రజాప్రతినిధుల దుర్భాషలు..ఇక చోటామోటా నేతల తిట్ల దండకం సరేసరి.
కానీ..సచివాలయాల్లో ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ ప్రచారావసరాలకు కావాలి. వారినే ఇంటింటికీ పంపించాలి. ఎడపెడా సర్వేలు చేయించుకుని ప్రభుత్వ ప్రగతి అంటూ ప్రగల్భాలు పలకాలి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అంటూ సచివాలయాల పేర్లు మార్చిన ప్రభుత్వం ఉద్యోగుల విధులను సైతం అస్తవ్యస్తంగా మార్చేసింది. ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి మరీ ఒత్తిడి తెచ్చి సర్వేలు చేయించుకుంటోంది. ఈ ఒత్తిడి భరించలేక కొందరు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేస్తే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడి తనవు చాలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ట్విట్టర్ క్యాంపెయిన్ సమాచారం మేరకు 2024 సెప్టెంబర్ నుంచి ఈ నెల 10వ తేది లోపు 70 మంది ప్రాణాలు కోల్పోయారని సంఘం సభ్యులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే రెండు మరణాలు సంభవించగా...వివిధ కారణాలు చూపి పదుల సంఖ్యలో రాజీనామాలు చేసేశారు.
ప్రతి నెలా సర్వేలు...టార్గెట్లు!
సచివాలయ పరిధి విధులతో పాటు అదనంగా పదుల సంఖ్యలో సర్వేలు చేయడంపై ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి నెలా ఏకంగా 32 సర్వేలను చేయడం టార్గెట్‌గా పెట్టారు. ప్రధానంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర సర్వే, పీఎం కిసాన్ డ్రోన్స్ ఓబురేషన్ సర్వే, ఎన్‌సీడీసీ సర్వే, ఇ– క్రాప్ బుకింగ్ సర్వే, ఎఫ్‌ఎం సర్వే, ఆధార్ సర్వే, కౌశలం సర్వే, మనమిత్ర ద్వారా అందిస్తున్న 564 సేవలపై సర్వే, కొత్త రేషన్ కార్డుల సర్వే, బయోమెట్రిక్ అప్‌డేషన్ సర్వే, పి–4, పాస్‌బుక్స్ సర్వే, ఏహెచ్‌ఎస్ సర్వే, అభ సర్వే, సెమి
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అర్హత పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.34 లక్షల మందికి సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 6880 మంది ఉద్యోగులు విధుల్లో చేరారు. వీరికి అనుసంధానంగా వలంటీర్ల వ్యవస్థ కూడా అమలు చేయడంతో వలంటీర్ల ద్వారానే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలు, గుర్తింపు, లబ్ధిని కూడా ఇంటింటికీ అందించేవారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేయడంతో పాటు ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడి లేకుండా విధుల నిర్వహించుకునేవారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నమైంది. వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడేసి వారి విధులన్నీ సచివాలయాల ఉద్యోగులకు అప్పగించేశారు. దీంతో పనిభారం ఎక్కువైంది.


