మాజీ మంత్రి కాన్హు చరణ్ లెంకా మృతి
భువనేశ్వర్: భారత పార్లమెంటు మాజీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంపీ కాన్హు చరణ్ లెంకా (86) కన్నుమూశారు. ఆయన కేంద్రంలో పీవీ నరసింహారావు హయాం ప్రభుత్వంలో రైల్వే, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. కాన్హు చరణ్ లెంకా 1988–94 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కటక్ జిల్లా చౌద్వార్ నియోజక వర్గం నుంచి ఎన్నికై 1995 నుంచి 2000 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.
శాసన సభ ఆవరణలో తుది వీడ్కోలు
కాన్హూ చరణ్ లెంకా భౌతిక కాయం రాష్ట్ర శాసన సభకు చేరిన తర్వాత ప్రభుత్వ లాంచనాలతో తుది వీడ్కోలు పలికారు. శాసన సభ స్పీకరు సురమా పాఢి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్ప గుచ్ఛంతో నివాళులర్పించారు.
మాజీ మంత్రి కాన్హు చరణ్ లెంకా మృతి


