శరవేగంగా రాయపూర్–విశాఖ కారిడార్ నిర్మాణం
జయపురం: చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న రాయపూర్–విశాఖపట్నం 6 లైన్ల భారత మాల ఆర్థిక కారిడార్ పనులు త్వరిత గతిన పూర్తి చేస్తున్నారు. ఈ భారత మాల కారిడార్ 2026 జూన్‌లో ప్రజలకు అంకితం అవుతుందని భారత జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు వెల్లడించారు. ముఖ్యంగా ఈ కారిడార్‌లో రెండు టన్నెళ్లు, రహదారులు పరిశీలించి ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. ఈ కారిడార్ ఎక్స్‌ప్రెస్ హైవే జాతీయ అంతర్జాతీయ ఇంజినీర్లతో నిర్మిస్తున్నారు. దాదాపు 468 కిలోమీటర్ల పొడవుగల ఈ కారిడార్ చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్ సమీప అవనపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సమీప సబ్బవరం వరకు వేస్తున్న 6 లైన్ల భారత మాల ఆర్థిక కారిడార్ ను రూ.16 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ కారిడార్ ఒడిశా రాష్ట్రంలో నవరంగపూర్, కొరాపుట్ జిల్లాల మీదుగా వేశారు. ఈ ప్రాజెక్టులు హైబ్రిడ్ అన్యూనిటీ మోడల్ లో 15 ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం చేపట్టారు. వాటిలో చత్తీస్‌గఢ్‌లో 3 ప్యాకేజీలు ఒడిశాలో 8 ప్యాకేజీలు, ఆంధ్రప్రదేశ్ లో 4 ప్యాకేజీలు ఉన్నాయి. వాటిలో ఇంతవరకు 3 ప్యాకేజీల పనులు నిర్మాణాధీనంలో ఉన్నాయి.
శరవేగంగా రాయపూర్–విశాఖ కారిడార్ నిర్మాణం
శరవేగంగా రాయపూర్–విశాఖ కారిడార్ నిర్మాణం
శరవేగంగా రాయపూర్–విశాఖ కారిడార్ నిర్మాణం
శరవేగంగా రాయపూర్–విశాఖ కారిడార్ నిర్మాణం


