తల్లిదండ్రులకు పాదపూజ
జయపురం: జయపురం సరస్వతీ శిశు విద్యామందిరం అరవింద్ నగర్లో మాతృ, పితృ పూజా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో యోగా వేదాంత సమితి సభ్యులు ఇతిశ్రీ మిశ్రా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే కె.సుశీలా రాజ్, గంగా భాయి, సంతోషిణీ పాత్రోశ్యామ సుందర్ బరాల్, కె.గోవిందరాజ్, మీనతి కుమార్ పట్నాయక్ గౌరవ అతిథిలుగా హాజరయ్యారు. విద్యాలయ ప్రధాన ఆచార్యులు డాక్టర్ రమణీ రంజన్ దాస్ అధ్యతన జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల స్వాగతగీతాలాపనతో ప్రారంభమైంది. అనంతరం మాతృ, పితృ భక్తి ప్రధాన నృత్య ప్రదర్శణ నిర్వహించారు. అలాగే విద్యార్ధులు తమ తల్లిదండ్రులకు పూలు, చందనం ధూప దీపాలతో పాదపూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు మాట్లాడుతూ.. పిల్లలను తల్లి దండ్రులు ప్రాణం కంటే మన్నగా ప్రేమించి వారి ఉన్నతే లక్ష్యంగా తీర్చి దిద్దుతారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు గురువు, దైవాలని ఉద్బోంధించారు. 178 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


