● ఘనంగ కలశ యాత్ర | - | Sakshi
Sakshi News home page

● ఘనంగ కలశ యాత్ర

Feb 15 2026 6:50 AM | Updated on Feb 15 2026 6:50 AM

● ఘనం

● ఘనంగ కలశ యాత్ర

జయపురం: జయపురం సమితి ఉమ్మరి గ్రామ పంచాయతీ గగణాపూర్‌లో దాదాపు 400 ఏళ్లకు పైగా చరిత్ర గల బాలుంకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయంలో యజ్ఞమండప ప్రతిష్ట, మహాశిరాత్రి సందర్భంగా శనివారం మహా కలశ శోభా యాత్ర నిర్వహించారు. జయపురం లోకనాథ్‌ దేవాలయ ప్రాంగణంలో గల ఖజురి బంద(ఖజురి చెరువు)లో పవిత్ర జలాన్ని కలశాల్లో నింపుకుని వేద మంత్రోచ్ఛరణలు మధ్య లోక్‌నాథ్‌ ఆలయ కూడలి నుంచి శోభాయాత్ర బయల్దేరింది. వందలాది మంది మహిళలు పవిత్ర కలశాలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. కలశ శోభాజాత్ర రఘునాత్‌ మందిరం, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మార్గం గుండా గగణాపూర్‌ కు బయల్దేరింది. గగణాపూర్‌ బాలుంకేశ్వర్‌ మహదేవ్‌ మందిరంలో యజ్ఞప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు, మహాశివరాత్రి వేడుకలు మూడు దినాలు జరుగుతాయని పూజారులు వెల్లడించారు.

● ఘనంగ కలశ యాత్ర1
1/2

● ఘనంగ కలశ యాత్ర

● ఘనంగ కలశ యాత్ర2
2/2

● ఘనంగ కలశ యాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement