విద్యార్థులు దేశ పురోగతిలో భాగస్వాములు కావాలి
రాయగడ: విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి దేశ పురోగతిలో భాగస్వాములు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్‌చంద్ర నాయక్ అన్నారు. స్థానిక అటానమస్ కళాశాలలో వాణిజ్యశాస్త్ర విభాగం తరఫున వికసిత భారతదేశం కోసం వికసిత ఒడిశా అభివృద్ధి అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అన్నివర్గాల ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, పేదరికాన్ని తగ్గిస్తూ సమానత్వం, విద్య, ఆరోగ్య రంగాలను మెరుగుపరచడం ద్వార దేశ పురోగతిని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. సదస్సులో అధ్యాపకులు కిశోర్‌కుమార్ దాస్, డాక్టర్ బిశ్వమోహన్ జెన్న, డాక్టర్ అజయ్ ప్రతాప్ యాదవ్, డాక్టర్ ప్రణయ్ పరాశర్, అధ్యాపకులు బాతేశ్వర్ సింగ్, డాక్టర్ సచిన్ గుప్తా, డాక్టర్ సమీర్ కుమార్ మిశ్ర, డాక్టర్ మలయ రంజన్ మహాపాత్రో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్పిపాల్ డాక్టర్ సరస్వతి రాయ్, కామర్స్ విభాగం అధిపతి సుబ్రత్ కుమార్ ప్రధాన్, డాక్టర్ మానసీ మహంతిల అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు చివరిలో సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు.


