జగన్నాథ ఆలయంపై డ్రోన్‌ ఎగురవేత | - | Sakshi
Sakshi News home page

జగన్నాథ ఆలయంపై డ్రోన్‌ ఎగురవేత

Feb 14 2026 10:01 AM | Updated on Feb 14 2026 10:01 AM

జగన్న

జగన్నాథ ఆలయంపై డ్రోన్‌ ఎగురవేత

భువనేశ్వర్‌: పూరీ శ్రీ జగన్నాథ ఆలయంపై నిషేధిత పరిధి ప్రాంతంలో డ్రోన్‌ ఎగురవేసి పర్యాటకుడు పట్టుబడ్డాడు. నో–ఫ్లై జోన్‌ నిబంధన ఉల్లంఘన ఆరోపణ కింద నిందితుని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల యువకుడు అభ్యుదయ సిన్హాగా గుర్తించారు. శ్రీ మందిరం ఉత్తర ద్వారం పరిసరాల్లో డ్రోన్‌ సరంజామాతో పోలీసులకు చిక్కాడు. సింహద్వార్‌ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

క్యాన్సర్‌పై అవగాహన అవసరం

రాయగడ: మహిళల్లో తరచూ కనిపించే బ్రెస్టు క్యాన్సర్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కేంద్రాస్పత్రి ఏడీఎంవో డాక్టర్‌ మమత చౌదరి అన్నారు. స్థానిక సాయిప్రియ మహిళా వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలొ ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. వివిధ స్టేజీల్లో కనిపించే బ్రెస్టు క్యాన్సర్‌ ఎలా సంభవిస్తుంది, తీసుకునే జాగ్రత్తలు గురించి ఆమె వివరించారు. గౌరవ అతిథిగా హాజరైన డాక్టర్‌ లోక్‌నాథ్‌ రాజు మాట్లాడుతూ.. జంక్‌ ఫుడ్‌ వంటి వాటికి దూరంగా ఉండాలని అన్నారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మితంగా ఆహారం తీసుకోవడం, క్రమతప్పకుండా వ్యాయామం చేయడంతో ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్‌ అధ్యక్షురాలు పొట్టాం రమాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులకు సన్మానించారు.

జగన్నాథ ఆలయంపై  డ్రోన్‌ ఎగురవేత 1
1/1

జగన్నాథ ఆలయంపై డ్రోన్‌ ఎగురవేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement