గవర్నర్‌తో మంత్రి భేటీ
భువనేశ్వర్: లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటితో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాలన, అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వారు నిర్మాణాత్మక చర్చలు జరిపారు. త్వరలో బడ్జెటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరివురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
బంద్‌లో చిక్కుకున్న పెళ్లికొడుకు
భువనేశ్వర్: దేశవ్యాప్త బంద్‌లో భాగంగా భువనేశ్వర్‌లో వాహనాల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో వివాహ వేదిక వద్దకు వెళ్తున్న పెళ్లికుమారుడి వాహనాన్ని అడ్డుకోవడంతో బంధువులంతా ఆందోళనకు గురయ్యారు. స్థానిక జయదేవ్ విహార్ స్క్వేర్‌లో జాతీయ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తమ వాహనాన్ని బంద్ నుంచి మినహాయించాలని కోరడంతో ఆందోళనకారులు సానుకూలంగా స్పందించి దారి ఇవ్వడంతో పెళ్లికుమారుడు, బంధువులు ముందుకు కదిలారు.
నేడు నబరంగ్‌పూర్‌లో సీఎం మోహన్‌చరణ్ మజ్జి పర్యటన
కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్జి శుక్రవారం నబరంగ్‌పూర్ జిల్లాకి రానున్నారు. ఉదయం మండయ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పడాలగుడ ప్రాంతంలో నిర్మించనున్న మెడికల్ కళాశాల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే శ్రీ జగన్నాథ తీర్థ యోజన పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలు పూరీ జగన్నాథ దర్శనం ఉచితంగా చేసుకోవడానికి సహాయం అందుతుంది. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి ప్రభాతీ పరిడా, మంత్రులు ముఖేష్ మహాలింగ్, నిత్యానంద గొండోలు పాల్గొంటారు. సుమారు రు.400 కోట్ల విలువ గల వివిధ ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి.
హజ్ యాత్రికులకు వైద్యపరీక్షలు
జయపురం: కొరాపుట్ జిల్లా అధికార యంత్రాంగం, కొట్‌పాడ్ ఆరోగ్య కేంద్రం సంయుక్తంగా జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్‌లోని మసీదులో అవిభక్త కొరాపుట్‌కు చెందిన 39 మంది హజ్ యాత్రికులకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. కొట్‌పాడ్ నుంచి 8 మంది ముస్లింలో హజ్‌యాత్రకు విదేశాలకు వెళ్తున్నట్లు మతపెద్దలు వెల్లడించారు.
దూడను చంపిన పులి!
రాయగడ: జిల్లాలోని మునిగుడ అటవీ రేంజ్ పరిధిలో డిమిరిగుడ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. గురువారం ఓ దూడపై దాడి చేసి పులి తిన్నట్లు అనుమానిస్తున్నారు. దూడను కట్టి ఉన్న ప్రాంతంలో పులి అడుగు జాడలు కనిపించినట్లు గ్రామస్తులు అటవీ శాఖ వారికి తెలియజేయడంతో రేంజర్‌తో సహా సిబ్బంది చేరుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గవర్నర్‌తో మంత్రి భేటీ
గవర్నర్‌తో మంత్రి భేటీ
గవర్నర్‌తో మంత్రి భేటీ
గవర్నర్‌తో మంత్రి భేటీ


