ఆటోను ఢీకొట్టిన కారు
ఇద్దరికి గాయాలు
కంచిలి: మకరాంపురం వద్ద జాతీయ రహదారిపై జాడుపూడి నుంచి సోంపేట వెళ్తున్న ఆటోను ఒడిశాకు చెందిన కారు బుధవారం ఉదయం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్, మరో మహిళ ఉన్నారు. కారులో డ్రైవర్ ఉన్నాడు. ఈ ఘటనలో కవిటి మండలం రాపాకపుట్టుగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నల్లాన సుందరరావు తీవ్రంగా గాయపడగా, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రుడిని సోంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీకొట్టిన కారు
ఆటోను ఢీకొట్టిన కారు


