ఘనంగా హిందూ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా హిందూ సమ్మేళనం

Feb 10 2026 8:06 AM | Updated on Feb 10 2026 8:06 AM

ఘనంగా

ఘనంగా హిందూ సమ్మేళనం

జయపురం: రాష్ట్రీయ స్వయంసేవక సంఘం(ఆర్‌.ఎస్‌.ఎస్‌) శతాబ్ది వేడుకల సందర్భంగా జయపురం సమితి ధనపూర్‌ గ్రామ పంచాయతీతో జయపురం ఆర్‌ఎస్‌ఎస్‌ వారు పంచాయతీ స్థాయి హిందూ సమ్మేళనం సోమవారం నిర్వహించింది. కార్యక్రమంలో ధన్‌పూర్‌ పంచాయతీలోని 9 గ్రామాల నుంచి 1500 మంది సనాతనులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ధనపూర్‌ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు విద్యాధర పూజారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ హిందూ సంప్రదాయాన్ని సంస్కృతిని మనం కాపాడుకోవాలని, మత మార్పిడిని అరికట్టాలని పిలుపు నిచ్చారు. సమ్మేళనంలొ ముఖ్యవక్తగా విశ్వనాథ్‌ మాలి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రంజిత్‌ బెహరాలు హిందూ సంస్కృతిపై ప్రసంగించారు. ఈ సందర్భంగా కలశ జాత్ర, గీతా యజ్ఞం,నామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు.

ఘనంగా హిందూ సమ్మేళనం 1
1/2

ఘనంగా హిందూ సమ్మేళనం

ఘనంగా హిందూ సమ్మేళనం 2
2/2

ఘనంగా హిందూ సమ్మేళనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement