వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

వినతుల వెల్లువ

Feb 10 2026 7:21 AM | Updated on Feb 10 2026 7:21 AM

వినతు

వినతుల వెల్లువ

వినతుల వెల్లువ

రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌ సద్భావణ సమావేశం హాల్‌లో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి పాల్గొన్నారు. సమితిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 73 వినతులను స్వీకరించారు. 67 వ్యక్తిగతమైనవి, 16 గ్రామ సమస్యలుగా గుర్తించారు. స్వీకరించిన గ్రామ సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గుణుపూర్‌ సబ్‌ కలెక్టర్‌ దుదూల్‌ అభిషేక్‌ దిల్లిప్‌, డీఎఫ్‌ఓ అన్నా సాహెబ్‌, జిల్లా ముఖ్యవైద్యాధికారి సరోజినిదేవి, పద్మపూర్‌ సమితి అధ్యక్షురాలు మనిమాల సబర్‌, తదితరులు పాల్గొన్నారు.

55 వినతుల స్వీకరణ..

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్‌ సమితి బోడ డురాల్‌ పంచాయతీలో సోమవారం జిల్లా కలెక్టర్‌ సోమేశ్‌ ఉపాధ్యాయ్‌ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌ నిర్వహించారు. 55 వినతులను స్వీకరించారు. 16 వ్యక్తిగత ఫిర్యాదులు, 39 గ్రామ సమస్యలున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాల సేవలను అందించేందుకు శిబిరంలో ప్రత్యేక క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. కొత్త శ్రామిక కార్డులు అందజేశారు. సామాజిక భద్రతా పెన్షన్‌ పథకం కింద కొత్త పెన్షన్ల కోసం నమోదు చేపట్టారు. ఆరోగ్య శిబిరం నిర్వహించి వైద్య సేవలు అందించారు. ఎస్పీ వినోద్‌ పటేల్‌, జిల్లా అటవీశాఖ అధికారి సాయికిరణ్‌, సబ్‌ కలెక్టర్‌ దూర్యోధన్‌ బోయి, ఇతర అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

వినతుల వెల్లువ 1
1/1

వినతుల వెల్లువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement