పేదల కోసమే ‘జగన్నాథ్ దర్శన్’ పథకం
● నబరంగ్‌పూర్‌లో ప్రారంభించిన సీఎం మోహన్ చరణ్ మజ్జి
కొరాపుట్: ప్రతి పేదవాడు పూరీని దర్శించుకోవాలనే శ్రీ జగన్నాథ్ దర్శన్ పథకం ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి ప్రకటించారు. శుక్రవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో మండయ్ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 60 ఏళ్లు నిండిన పేదలు పూరి వెళ్లి రావడానికి పూర్తి ఏర్పాట్లు ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఈ పథకం ఈ రోజు గంజాం, సంబల్‌పూర్, భద్రక్, బరిపద జిల్లాల నుంచి ఈ పథకం ప్రారంభమైనట్లు తెలిపారు. జిల్లా వాసులకు ఆరోగ్య పరిరక్షణ కోసం మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ కాలేజీ పూర్తయితే నబరంగ్‌పూర్ జిల్లాతో పాటు కలహండి జిల్లా, సమీప చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రజలకు ఉపయెగ పడుతుందన్నారు. ఈ నిర్మాణం పనులు త్వరగా ప్రారంభమవుతాయన్నారు. జాజ్‌పూర్, కొంధమాల్, తాల్చేర్ లలో మెడికల్ కాలేజీలు ఈ 20 నెలలలో పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. మరో మూడు మెడికల్ కాలేజీలు డెంకనాల్, భద్రక్, జగత్ సింగ్ పూర్ జిల్లాల్లో నిర్మిస్తామన్నారు. దాదాపు రూ.440 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయన్నారు. నబరంగ్‌పూర్ కాలేజీకి నూతన భవనం నిర్మిస్తామన్నారు. త్వరలో జయపూర్–గోపాల్‌పూర్ మధ్య 6 లైన్ల జాతీయ రహదారి నిర్మిస్తామన్నారు. నబరంగ్‌పూర్–జయపూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రానున్న రెండేళ్లలో అన్ని పనులు పూర్తి చేస్తామని సీఎం మోహన్ చరణ్ మఝి ప్రకటించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ప్రభాతీ పరిడా, మంత్రులు ముఖేష్ మహలింగ్, నిత్యానంద గొండో, ఎంపీ బలబద్ర మఝి, రాజ్య సభ ఎంపీ మున్నా ఖాన్, ఎంఎల్‌ఎలు గౌరీ శంకర్ మఝి, మనోహర్ రంధారి, నర్సింగ బొత్ర, కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, ఎస్పీ సంపత్ సందీప్ పాల్గొన్నారు.
పేదల కోసమే ‘జగన్నాథ్ దర్శన్’ పథకం
పేదల కోసమే ‘జగన్నాథ్ దర్శన్’ పథకం
పేదల కోసమే ‘జగన్నాథ్ దర్శన్’ పథకం


