కలకలం | - | Sakshi
Sakshi News home page

కలకలం

Feb 14 2026 10:01 AM | Updated on Feb 14 2026 10:01 AM

కలకలం

కలకలం

మావో బ్యానర్ల

రాయగడ: జిల్లాలోని శేశిఖాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల దుమ్మాగుడ, చందిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల పాయికొపొడ, కల్యాణసింగుపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల కుంభారగుడ ప్రాంతాల్లో మావో బ్యానర్లు కలకలం సృష్టించాయి. ఒకే సారి మూడు ప్రాంతాల్లో మావో బ్యానర్లు దర్శనం ఇవ్వడంతో ఆయా ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్నాళ్ల కిందట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో 15 మంది మావోలు పోలీస్‌ ఉన్నతాధికారుల సమక్షంలొ లొంగిపొవడంతో జిల్లాలో మావోల బెడద పొయిందని భావిస్తున్న సమయంలొ మళ్లీ ఒకే రోజు మూడు ప్రాంతాల్లో మావో బ్యానర్లు కనిపించడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణానికి కేవలం కిలొమీటరున్నర దూరంలో ఉన్న దుమ్మాగుడ వంటి ప్రాంతంలొ మావోబ్యానర్లు ఏర్పాటు కావడం ఆందోళనకు గురిచేస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి వీటిని మావోలు ఏర్పాటు చేశారు. శనివారం నాడు ఆయా ప్రాంతాలకు సీఆర్పీఎఫ్‌ దళాలు చేరుకుని మావో బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ప్రాంత ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురవ్వొద్దని సీఆర్పీఎఫ్‌ దళాలు కోరాయి. మూడు ప్రాంతాల్లో దర్శనం ఇచ్చిన మావో బ్యానర్లలో మావో రాష్ట్ర శాఖ కార్యదర్శి మేఘా జాని, డొంబురు మాఝిల పేరిట ఉన్నాయి. ఇటీవల కాలంలొ మావోలుగా చెప్పుకుని పోలీసుల సమక్షంలో లొంగిపొయిన సవ్యసాచి పండ, నిఖిల్‌ రౌత్‌ అనే వ్యక్తులు ఆదివాసీలు కాదని బ్యానర్లలో రాసి ఉండటం కనిపించింది. ఆదివాసీ పేర్లతో మావోలుగా జీవనాన్ని కొనసాగించిన వారు ఆదివాసీల పేర్లు చెప్పుకుని వ్యాపారం చేసేవారని వారికి త్వరలొ బుద్ధి చెబుతామని వివరించారు. అదేవిధంగా జిల్లాలో ఏర్పాటువుతున్న బృహత్తర పరిశ్రమలు దొపిడికే ప్రాధాన్యమిస్తున్నాయని ప్రజల సంక్షేమం కోసం ఏమాత్రం కృషి చేయడం లేదని బ్యానర్లలో వివరించారు.

ఆ బ్యానర్లు సందేహాస్పదమే..

మావో పేర్లతో జిల్లాలో మూడు ప్రాంతాల్లో మావోల పేర్లతో వెలసిన బ్యానర్లు సందేహాస్పదంగా ఉన్నాయని అడిషనల్‌ ఎస్పీ, ఎస్పీ ఇన్‌చార్జి అమూల్య కుమార్‌ ధల్‌ ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ఎస్‌డీపీఓ కార్యాలయం ప్రాంగణంలో శనివారం నాడు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోలంటూ ఏర్పాటుచేసిన బ్యానర్లలొ పేర్కొన్న మావో నాయకుల పేర్లను తామెప్పుడు వినలేదని, అదేవిధంగా అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజానిజాలు నిగ్గు తేలుస్తామని భరోషా ఇచ్చారు. జిల్లాలొ మావోల సంఖ్య పూర్తిగా కనుమరుగువుతున్న నేపథ్యంలో శనివారం నాడు మూడు ప్రాంతాల్లో దర్శనం ఇచ్చిన బ్యానర్లకు సంబంధించి మూడు కేసులను నమోదు చేశామని అన్నారు.

కలకలం1
1/3

కలకలం

కలకలం2
2/3

కలకలం

కలకలం3
3/3

కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement