చట్టాలపై అవగాహన అవసరం
పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి గారబంద ఎస్.వి.టి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోష్ చట్టంపై అవగాహన, బాల్యవివాహాల నివారణ, ఎస్.ఓ.పిపై శిబిరాన్ని జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రౌళో ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ శిబిరంలో జస్టీస్ కార్నర్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు భాగ్యలక్ష్మి నాయక్, గారబంద సబ్ ఇన్‌స్పెక్టర్ లోకనాథ బెహరా, గారబంద ఎస్.వి.టి ప్రధాన ఉపాధ్యాయులు బి.గంగాధర్ పాల్గొన్నారు. విద్యార్థినులకు చట్టాలపై అవగాహన అవసరమన్నారు. ఈ శిబిరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హిరమండలం: ఎల్.ఎన్.పేట మండల కేంద్రం సమీపంలో ఉన్న తాయిబాంబాపురం నిర్వాసిత కాలనీకి చెందిన రైతు సురవరపు సింహాచలంకు చెందిన ఎనిమిది బస్తాల ధాన్యం చోరికి గురైనట్లు ఆయన తెలిపారు. కాలనీ సమీపంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ధాన్యాన్ని నిల్వ చేశామని, పాఠశాల ప్రహరీ విరగ్గొట్టి ధాన్యం బస్తాలను అపహరిచినట్లు వాపోయాడు. ధాన్యం విలువ సుమారు రూ.15 వేలు ఉంటుందన్నారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
శ్రీకాకుళం క్రైమ్: ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు కె.శంకరరరావుకు తోటి సిబ్బంది స్వచ్ఛందంగా ఒక్కరోజు వేతనం రూ.4.07 లక్షలను అందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఈ చెక్‌ను శంకరరావుకు అందజేశారు.
మందస: మందస రాజవంశీయులు, టెరిటోరియల్ ఆర్మీ మాజీ అధికారి పటాయత్ ప్రతాప్ కేసరి సింగ్ దేవ్(78) గుండెపోటుతో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఉన్న ఖార్వేలనగర్‌లో మరణించారు. ఆయన మరణంతో మందస, ఒడిశాలో విషాదచాయలు అలముకున్నాయి. దివంగత రాజ జగన్నాథ రాజమణి రాజ్ దేవ్ ద్వితీయ కుమారుడైన ప్రతాప్ కేసరి సింగ్ దేవ్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి.
చెక్కు అందజేస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి
చట్టాలపై అవగాహన అవసరం
చట్టాలపై అవగాహన అవసరం
చట్టాలపై అవగాహన అవసరం


