క్రికెట్‌ విజేతగా ఎస్పీ–11 | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ విజేతగా ఎస్పీ–11

Feb 16 2026 7:15 AM | Updated on Feb 16 2026 7:15 AM

క్రిక

క్రికెట్‌ విజేతగా ఎస్పీ–11

విజేతలకు ట్రోఫీని అందజేస్తున్న సబ్‌ కలెక్టర్‌ రమేష్‌ కుమార్‌ జెన్న, తదితరులు

రాయగడ: జిల్లాలోని టికిరి సమితి దొరాగుడలో గల ఉత్కళ అలూమిన కర్మాగారం ఆధ్వర్యంలో స్టేక్‌ హోల్డర్స్‌ వన్‌ డే క్రికెట్‌ మ్యాచ్‌ ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్‌లో రాయగడ జిల్లా యంత్రాంగం–11, ఎస్పీ–11, విశాఖపట్నం రైల్వే–11, టికిరి రైల్వే–11, సిఆర్‌పిఎఫ్‌ నాలుగొ బెటాలియన్‌–11, హిండాల్‌ కో–11 జట్లు పాల్గొన్నాయి. ఉత్కల అలూమిన యూనిట్‌ హెడ్‌ రవి నారాయణ మిశ్రో ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఫైనల్‌ టికిరి రైల్వే–11, ఎస్పీ–11 మధ్య జరిగింది. ఎస్పీ–11 విజేతగా, టికిరి రైల్వే–11 రన్నర్‌గా నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి రాయగడ సబ్‌ కలెక్టర్‌ రమేష్‌ కుమార్‌ జెన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫైనల్‌కు చేరుకున్న క్రీడాకారులతో కరచాలనం చేసి వారికి అభినందించారు అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ అందరి మధ్య స్నేహం మెరుగుపరుచుకునేందుకు ఇటువంటి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు.

క్రికెట్‌ విజేతగా ఎస్పీ–11 1
1/1

క్రికెట్‌ విజేతగా ఎస్పీ–11

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement