సాహిత్య సంబరం
శ్రీకాకుళం కల్చరల్:
శ్రీ శ్రీ కళావేదిక శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్‌లో ఆదివారం సిక్కోలు సాహితీ సంబరం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన శతాధిక కవి సమ్మేళనంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 142 మంది కవులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రభావం, ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, రాజకీయ లబ్ధి, అమెరికా అధ్యక్షుడు భారత్ వ్యతిరేక విధానం, తదితర అంశాలపై కవులు తమ గళాన్ని విప్పారు. వీరి కవితాగానాలు ప్రజలను చైతన్య పరిచేవిగా ఉన్నాయి. పాల్గొన్న కవులందరినీ సాహితీ శిరోమణి పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి టి.పార్థసారథి, కన్వీనర్ భోగెల ఉమామహేశ్వరరావు, అధ్యక్షులు మణిపాత్రుని నాగేశ్వరరావు, రాష్ట్ర సభ్యులు ముట్నూరు ఉపేంద్ర శర్మ, కిల్లాన శ్రీనివాసరావు, ఆర్.వి.రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
సిక్కోలు కవులకు నిలయం
సిక్కోలు కళలకు నిలయమని అంటారు. సాహిత్యానికి కూడా. కవులందరూ చక్కగా కవితా గానాలు చేశారు. రాబోయే రోజుల్లో మలేషియాలో కూడా పెద్ద ఎత్తున సాహితీ కార్యక్రమం నిర్వహిస్తాం.
– కత్తిమండ ప్రతాప్, శ్రీ శ్రీ కళా వేదిక
అంతర్జాతీయ చైర్మన్
సిక్కోలు చరిత్ర గొప్పది
సిక్కోలు చరిత్ర గొప్పదనం కోసం పద్యరూపంలో చదివాను. పాల్గొనే వారందరికీ మన గొప్పదనం తెలియాలి. కవుల కోసం మంచి వేదికను ఏర్పాటు చేశారు.
– వాడాడ శ్రీనివాసరావు, కవి
ఎక్కువ మంది పాల్గొన్నారు
శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన కవితోత్సవంలో మేము అనుకున్న దాని కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారు. ఎంతో మంది కువులు ప్రజాసమస్యలను ఎత్తి చూపారు. సమాజాభివృద్ధికి ఇలాంటి కవిత్వాలు రావాలి.
– డబ్బీరు గోవిందరావు, శ్రీశ్రీ కళావేదిక
ఉత్తరాంధ్ర అధ్యక్షుడు
కత్తి కంటే కలం గొప్పది
కత్తి కంటే కలం గొప్పదని తెలియజేశాను. కవులు తమ రచనల ద్వారా సమాజాన్ని ఉద్ధరిస్తారు. కలం గొప్పదనాన్ని తోటి కవులకు వినిపించాను.
– ముట్నూరు సౌందర్య లహరి, యువకవి
సాహిత్య సంబరం
సాహిత్య సంబరం
సాహిత్య సంబరం
సాహిత్య సంబరం


