కబడ్డీ విజేతగా పల్నాడు జట్టు | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ విజేతగా పల్నాడు జట్టు

Feb 16 2026 7:15 AM | Updated on Feb 16 2026 7:15 AM

కబడ్డీ విజేతగా పల్నాడు జట్టు

కబడ్డీ విజేతగా పల్నాడు జట్టు

సంతబొమ్మాళి: నందన్న ఆలయ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని గొదలాం గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీల విజేతగా పల్నాడు జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో పల్నాడు, గుంటూరు జట్లు తలపడ్డాయి. విజేతగా నిలిచిన పల్నాడు జట్టుకు రూ.50 వేల నగదు, షీల్డ్‌, ద్వితీయ స్థానంలో నిలిచిన గుంటూరు జట్టుకు రూ.30 వేలు, షీల్డ్‌ను స్థానిక ఎస్‌ఐ వై.సింహాచలం చేతులమీదుగా అందజేశారు. సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచిన కృష్ణ, తూర్పుగోదావరి జట్లుకు చెరో రూ.20 వేలు చొప్పున నగదును అందజేశారు. బెస్ట్‌ రైడర్‌గా బ్రహ్మారెడ్డి, బెస్ట్‌ డిఫెండర్‌గా ఇమ్యుల్‌, ఆల్‌ రౌండర్‌గా హరీష్‌లు నిలిచారు. కార్యక్రమంలో నిర్వాహకులు అడ్డి తిరుపతిరావు, రిఫరీలుగా రమేష్‌, పిలక ధనుంజయకుమార్‌, దూపాన రమణారెడ్డి, రెడ్డి అప్పన్న, దూపాన కృష్ణారెడ్డి, సూరాడ దాసురాజు, అప్పిలి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement