లింగరాజ్ ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ దంపతులు
భువనేశ్వర్: పవిత్ర మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సతీసమేతంగా లింగరాజ్ ఆలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల శాంతి, శ్రేయస్సు కోసం దైవిక ఆశీస్సులు కోరుతూ లింగరాజ్ మహా ప్రభువుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవాన్ని ప్రారంభించి కళాకారులు ప్రదర్శించిన భక్తి, సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. మహా శివరాత్రి భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక మేల్కొలుపును సూచిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ పవిత్ర మహాశివ రాత్రి అందరిలో ధర్మాన్ని, అంతర్గత బలాన్ని ప్రేరేపిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.


