పర్యాటకులను కాపాడిన లైఫ్‌గార్డ్‌లు
భువనేశ్వర్: పూరీ స్వర్గద్వార్ సెక్టార్ 10 తీరంలో అందుబాటులో ఉన్న లైఫ్‌గార్డ్‌ల సత్వర స్పందన 5 మంది పర్యాటకుల అమూల్య ప్రాణాలు కాపాడింది. ఈ తీరంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు బలమైన అలల ధాటికి కొట్టుకుపోయి ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక భారీ అల అకస్మాత్తుగా ఎగసిపడి 5 మంది పర్యాటకులను ముంచెత్తింది. వారిలో నలుగురు చత్తీస్‌గఢ్ ప్రాంతీయులు కాగా మరొకరు మహారాష్ట్ర పర్యాటకుడు ఉన్నారు. పర్యాటకులు స్వాతి కానోజీ, భవన్ కానోజీ, శిఖా కానోజీ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఖగేశ్వర్ కానోజీ, మహారాష్ట్రకు చెందిన కృష్ణ కానోజీ ఉన్నారు. ప్రథమ చికిత్స తర్వాత వీరంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. పర్యాటకులను మహేంద్ర బెహెరా, ఎ. భగబన్, కేడీ బెహెరా, పి.తిరుపతి లైఫ్‌గార్డ్‌ల బృందం రక్షించింది.
పర్యాటకులను కాపాడిన లైఫ్‌గార్డ్‌లు


