కేంద్రమంత్రిని కలిసిన బెంగాళీ సమాజ్ సభ్యులు
మల్కన్‌గిరి: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మల్కన్‌గిరి జిల్లా బెంగాళీ సమాజ్ సభ్యులు ఢిల్లో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా మల్కన్‌గిరిలో గత ఏడాది డిసెంబర్ 7, 8 తేదీల్లో యం.వి.26 హిందూ బెంగాళీ గ్రామంపై జరిగిన సమూహ దాడి విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని పునః పరిశీలించాలని కోరారు. బెంగాళీ సమాజ జిల్లా అధ్యక్షుడు గౌరాంగ కర్మకార్ నేతృత్వంలో గోపాల్‌చంద్ర విశ్వాస్, నిర్మాయ్ చంద్రపాల్, మాణికలాల్ చక్రవర్తి, కమలేష్ రాయ్, ఉత్తమ్ బసు, భవాని శంకర్ ముఖర్జీ, సంజయ్ సర్కార్, నిహార్ రాయ్‌లు ఢిల్లీలో ఆదివాసీ అభివృద్ధి మంత్రి జువల్ ఓర్మ్, సమ్‌బిత్ పాత్రో, ఎంపీ వృద్రనారాయన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు .


