జాతీయ పెన్షన్‌ పథకంపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

జాతీయ పెన్షన్‌ పథకంపై శిక్షణ

Feb 13 2026 5:25 AM | Updated on Feb 13 2026 5:25 AM

జాతీయ

జాతీయ పెన్షన్‌ పథకంపై శిక్షణ

పర్లాకిమిడి: జిల్లా ట్రెజరీ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌.పి.ఎస్‌)పై శిక్షణ శిబిరాన్ని ట్రెజరీ, ఆడిట్‌ డైరెక్టరేట్‌ (భువనేశ్వర్‌) మనోరంజన్‌ సాహు గురువారం ప్రారంభించారు. ఈ శిబిరంలో అకౌంటెంట్‌ ఆరవింద సాహు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఎన్‌.పి.ఎస్‌పై అవగాహన, వివిధ సమస్యల పరిష్కారం, అభియోగాలను వివరించారు. కొత్తగా ఉద్యోగాలలో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌.పి.ఎస్‌ ఖాతా ఎలా తెరవాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్లు, సంసోదన ప్రక్రియ, ఇతర విషయాలపై మార్గదర్శకాలను వివరించారు. ఈ శిబిరంలో జిల్లా కోశాధికారి ప్రియబ్రతో షడంగి, సంగీత కుమారి, అదనపు జిల్లా కోశాధికారి, ఇతర ఉపకోశాధికారులు, ప్రభుత్వ విభాగాల డి.డి.ఓ.లు, ఎన్‌.పి.ఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ శిబిరం 13వ తేదీ వరకు జరగనుంది.

జాతీయ పెన్షన్‌ పథకంపై శిక్షణ 1
1/1

జాతీయ పెన్షన్‌ పథకంపై శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement