ముగిసిన స్వీయ రక్షణ నైపుణ్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన స్వీయ రక్షణ నైపుణ్య శిబిరం

Feb 12 2026 7:07 AM | Updated on Feb 12 2026 7:07 AM

ముగిసిన స్వీయ రక్షణ నైపుణ్య శిబిరం

ముగిసిన స్వీయ రక్షణ నైపుణ్య శిబిరం

రాయగడ: స్థానిక అటానమస్‌ కళాశాలలో నిర్వహిస్తున్న స్వియ రక్షణ నైపుణ్య శిబిరం బుధవారంతో ముగిసింది. కళాశాల ప్రిన్సిపాల్‌ సరస్వతి రాయ్‌ అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు సభలో ఆదర్శ్‌ డిగ్రీ కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ శ్యామ మోహన్‌ పాత్రో ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ఆత్మరక్షణ, ఆత్మ విశ్వాసాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వీయరక్షణ, భద్రతను తెలుసుకోవాలని సూచించారు. ఆత్మరక్షణ అనేది కేవలం శారీరక నైపుణ్యం మాత్రమే కాదని, మనో ధైర్యానికి ప్రతీకని అన్నారు. నేటి సమాజంలో విద్యార్థులు ఇటువంటి శిక్షణ తీసుకోవడం ఎంతో మేలన్నారు. అటానమస్‌ కళాశాల పీజీ కౌన్సిల్‌ చైర్మన్‌ పి.ఆరుణ్‌ కుమార్‌, అధ్యాపకురాలు టి.జ్యోతి, ఉదయ్‌ నాయక్‌, తదితరులు ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు శిక్షణకు సంబంధించిన ధ్రువపత్రాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement