క్రికెట్‌ విజేతగా చాలెంజర్స్‌ | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ విజేతగా చాలెంజర్స్‌

Feb 9 2026 8:11 AM | Updated on Feb 9 2026 8:11 AM

క్రిక

క్రికెట్‌ విజేతగా చాలెంజర్స్‌

పర్లాకిమిడి: దివంగత క్రికెటర్‌ అబ్దుల్లా స్మారక కళింగా క్రికెట్‌ టోర్నమెంట్‌ శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రంతో ముగిసింది. గత నెల 11న క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. ఆదివారం వైట్‌క్యాప్స్‌ (పర్లాకిమిడి), చాలెంజర్స్‌ (పర్లాకిమిడి) జట్ల మధ్య జరిగింది. టాస్‌ గెలిచిన వైట్‌ క్యాప్స్‌ జట్టు నిర్ణీత 30 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. పర్లాకిమిడి చాలెంజర్స్‌ 26 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి విజేతగా నిలిచింది. విజేత జట్టు చాలెంజర్స్‌కు చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌, పొట్నూరు రామకృష్ణ రూ.25 వేల చెక్కు, కప్పును అందజేశారు. రన్నర్స్‌గా నిలిచిన వైట్‌ క్యాప్స్‌ టీమ్‌కు అబ్దుల్లా తమ్ముడు రూ.18 వేల చెక్కు, కప్పును అందజేశారు. పొట్నూరు రామకృష్ణ ప్రథమ బహుమతిని స్పాన్సర్‌ చేసినందుకు కళింగ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వాహకులు అట్టాడ రమేష్‌ అభినందనలు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో గజపతి క్రికెట్‌ ప్లేయర్స్‌ సెక్రటరీ దేబాషిష్‌ పాడీ(మిట్టు), సంతోష్‌ పట్నాయక్‌, న్యాయవాది పరిడా తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్‌ విజేతగా చాలెంజర్స్‌ 1
1/1

క్రికెట్‌ విజేతగా చాలెంజర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement