అదుపుతప్పిన బస్సు
పర్లాకిమిడి: జాతీయ రహదారి 326–ఎ మోహనా బ్లాక్ చాందిపుట్ కళాశాల సమీపంలో విక్రాంత్ ప్రైవేట్ బస్సు మరో బస్సును ఢీకొట్టడంతో 30మంది యాత్రికులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గజపతి జిల్లా మోహనా పోలీస్ ష్టేషన్ పరిధి చాందిపుట్ ప్రైవేట్ కళాశాల సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విక్రాంత్ ప్రైవేట్ బస్సు ఆర్.ఉదయగిరి నుంచి సంబల్‌పూర్ వెళ్లి అక్కడ నుంచి బరంపురం వెళ్తుండగా.. మరో బస్సును ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన కొండకు ఢీకొంది. ఈ సంఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ఏడుగురుకి తీవ్రగాయాలవ్వడంతో క్షతగాత్రులను చంద్రగిరి, మోహనా ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో జాయిన్ చేశారు. సంఘటనా స్థలానికి మోహనా అగ్నిమాపకదళం చేరుకుని క్షతగాత్రులను మోహన, చంద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. మోహనా పోలీసు అధికారులు ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


