ఇన్విజిలేషన్‌లో ఆటోమేషన్‌ సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఇన్విజిలేషన్‌లో ఆటోమేషన్‌ సరికాదు

Feb 13 2026 5:25 AM | Updated on Feb 13 2026 5:25 AM

ఇన్విజిలేషన్‌లో ఆటోమేషన్‌ సరికాదు

ఇన్విజిలేషన్‌లో ఆటోమేషన్‌ సరికాదు

శ్రీకాకుళం: మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్‌ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని పీఆర్‌టీయూ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం డీఈవో రవిబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్విజిలేషన్‌ విధులు నిర్వహించడంలో ఆటోమేషన్‌ విధానాన్ని అవలంబించడం సరికాదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు పలు ఇబ్బందులు ఉంటాయని, వాటిని పరిశీలించి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 220 పని దినాలు తక్కువ కాకుండా పనిచేసిన పాఠశాలలకు రెండో శనివారం సెలవుగా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పప్పల రాజశేఖర్‌, జిల్లా అధ్యక్షుడు తంగి మురళీమోహన్‌రావు, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు బి.రవికుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు కరణం సీతరాజు, రూరల్‌ మండల అధ్యక్షుడు రెడ్డి వెంకటరమణ, ఎం.ఆనందరావు, ఎం.భాస్కరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement