శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
పేదల కోసమే.. జగన్నాథ్ దర్శన్ నబరంగ్‌పూర్‌లో ప్రారంభమైంది. సీఎం ప్రారంభించారు. –IIలోu
న్యూస్‌రీల్
శ్రీ మందిరం ఆదాయం లెక్కింపు
నగదు : రూ. 6,96,748
బంగారం : 5 గ్రాముల 300 మిల్లీ గ్రాములు
వెండి : 81 గ్రాముల 100 మిల్లీ గ్రాములు
– భువనేశ్వర్/పూరీ
ప్రమాదం జరిగిందిలా..
ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న బస్సు బాలాసోర్–భద్రక్ రోడ్డు మార్గంలో బహనాగా చౌరస్తా సమీపంలో రెండు బ్రిడ్జిల మధ్య అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ ధాటికి బస్సు అద్దం పగిలిపోయి డ్రైవర్ కిందపడి చనిపోయారు. బస్సులో ఉన్న మరో డ్రైవర్‌కు, వంటమనిషికి గాయాలయ్యాయి. డ్రైవర్ వెనక సీటులో కూర్చొన్న కొండ వెలగాడకు చెందిన భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 10 మందికి గాయాలయ్యాయి. బస్సులో ఉన్న 40 మంది నెల్లిమర్ల మండలం కొండ వెలగాడ గ్రామస్తులే.
తీర్థయాత్ర ముగిసే వేళ..
భువనేశ్వర్/కొరాపుట్: బాలాసోర్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయం సుమారు 5.15 గంటల ప్రాంతంలో బాలాసోర్–భద్రక్ రోడ్డు మార్గంలో బహనాగా చౌరస్తా సమీపంలో కోల్‌కతా నుంచి పూరీకి వెళ్తున్న శ్రీ వెంకటలక్ష్మి యాత్రికుల బస్సు అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఫలితంగా బస్సు డ్రైవర్ వంతెనను ఢీకొట్టడంతో వంతెన కిందకు ఊగిసలాడింది. డ్రైవర్ కిందకు పడడంతో అక్కడికక్కడే మరణించాడు. ఖంతపడా ఠాణా పోలీసులు ఘటనా స్థలం చేరి సహాయక చర్యలు పర్యవేక్షించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ వాసులు. కాశీయాత్రకు బయల్దేరి ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. క్షతగాత్రులను ఖంతపడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఖంతపడా ఠాణా పోలీసులు, బహనాగా అగ్నిమాపక విభాగం, జాతీయ రహదారి పోలీసులు సంయుక్తంగా గాయపడిన ప్రయాణికులను సంఘటన స్థలంలో రక్షించి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదాన్ని గమనించి తక్షణమే చొరవ కల్పించుకుని బాధితులకు సహాయక చర్యలు చేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి గాయపడిన వారిని ఆదుకున్నారు.
కాశీయాత్ర ముగుస్తుందనగా..
ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా నుంచి కాశీ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం సంభవించడంతో ఘటనా స్థలంలో బస్సు డ్రైవర్ నడిపేన శ్రీనివాస రావు (55) మృతి చెందాడు. అతడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామస్తుడు. ఘటనా స్థలం సందర్శించిన బాలాసోర్ జిల్లా ఖంతపొడా ఠాణా పోలీసులు మృతదేహం స్వాధీనపరచుకుని శవ పరీక్షల కోసం సొరొ ఆస్పత్రికి తరలించినట్లు ఠాణా అధికారి తెలిపారు.
కాశీ యాత్ర కోసం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం నుంచి ఈ నెల 2వ తేదీన 40 మంది యాత్రికులతో ఈ బస్సు బయల్దేరింది. మరో రెండు రోజుల్లో వీరి యాత్ర పూర్తి కానున్న చివరి దశలో ఘోర ప్రమాదానికి గురైందని నెల్లిమర్ల మండలం నివాసి జి. గణేష్ ‘సాక్షి’కి వివరించాడు. యాత్రికులు అంతా 45 ఏళ్లు పైబడిన వారుగా పేర్కొన్నాడు. యాత్రికుల్లో 28 మంది మహిళలు ఉన్నారు. కాశీ యాత్ర ముగించుకుని పూరీ, కోణార్క్ సందర్శనకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగిందని వాపోయాడు. అంతా స్వల్ప గాయాలతో చికిత్స పొంది కోలుకున్నట్లు వివరించాడు. ఫకీర్ మోహన్ వైద్య బోధన ఆస్పత్రిలో వీరికి చికిత్స కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిలో 8 మంది మహిళలు ఉన్నారు. బాధితులకు వసతి, చికిత్స వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఈ సంఘటనపై విచారణ చేపట్టిన ఖంతపొడా ఠాణా ఏఎస్‌ఐ ఉదయ్ భక్త్ సాక్షికి తెలిపారు. డ్రైవర్ శవ పంచనామా శనివారం జరుగుతుందన్నారు.
సాయం కోసం నిరీక్షణ
ప్రమాదం తర్వాత మార్గమధ్యంలో స్తంభించి పోయిన యాత్రికులు సాయం కోసం నిరీక్షిస్తున్నారు. తిరుగు ప్రయాణానికి అనుకూలమైన సౌకర్యాలు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.
ప్రమాదానికి గురై వంతెనపై
ఊగిసలాడుతున్న యాత్రికుల బస్సు
మరో రెండు రోజులు ఆగితే..
ఈ నెల 2వ తేదీన వీరు విజయనగరం జిల్లా నుంచి తీర్థయాత్రలకు బయల్దేరారు. కాశీ కూడా చూసి వచ్చేశారు. మరో రెండు రోజుల్లో యాత్ర పూర్తవుతుంది. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు నడిపేన శ్రీనివాసరావు కుమారుడు ఎనిమిది నెలల కిందటే చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి మరో చావు కబురు వినిపించడం విషాదకరం.
ఇంకా చీకటి తెరలు తొలగని వేకువ. అంతా మగత నిద్రలో ఉన్న వేళ. రోడ్డుపై దూసుకెళ్తున్న బస్సు అకస్మాత్తుగా ఆగింది. బస్సులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లేచి చూసే సరికి బస్సు వంతెనపై నుంచి వేలాడుతోంది. రెండు బ్రిడ్జిల మధ్య ఉన్న పొడవాటి డివైడర్‌ను బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్ బస్సు అద్దంతో పాటు బయటికి తుళ్లిపోయి వంతెన కిందకు పడి ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడో విజయనగరం జిల్లా నుంచి తీర్థయాత్రలకు బయల్దేరి కాశీ చూసుకుని మరో రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోతామనగా.. ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి గురైన టూరిస్టు బస్సు
అదుపు తప్పి వంతెనపై వేలాడిన వాహనం
ఒకరి మృతి, 14 మందికి గాయాలు
బాధితులు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల వాసులు
శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


