గిరిజన రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

గిరిజన రైతుల ఆందోళన

Feb 15 2026 6:50 AM | Updated on Feb 15 2026 6:50 AM

గిరిజ

గిరిజన రైతుల ఆందోళన

కొత్తూరు : ప్రభుత్వం పంపిణీ చేసిన డీ పట్టా భూముల్లో వాటర్‌ ట్యాంకు పనులు చేపడితే సహించేది లేదని మెట్టూరుగూడకు చెందిన గిరిజన రైతులు శనివారం ఆందోళనకు దిగారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవన సాగిస్తున్న తమ భూముల్లో వాటర్‌ ట్యాంకు పనులు చేపట్టడం సరికాదంటూ నిరసన వ్యక్తం చేశారు. నష్ట పరిహారం చెల్లించే వరకు పనులు చేపట్టవద్దన్నారు.

నోటిఫైడ్‌ కాని సర్టిఫికెట్‌తో పీజీ సీటు!

లింగాలవలస పీహెచ్‌సీ వైద్యుడిపై దర్యాప్తు

టెక్కలి: గిరిజన ప్రాంతంలో పీహెచ్‌సీ ఉందంటూ టెక్కలి మండలం లింగాలవలస పీహెచ్‌సీ వైద్యుడు పవన్‌తేజ ట్రైబల్‌ నోటిఫైడ్‌ సర్టిఫికెట్‌తో పీజీ సీటులో జాయిన్‌ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు పీజీ సీటుకు అర్హత సాధించాలంటే మూడేళ్లు రూరల్‌ పీహెచ్‌సీ, రెండేళ్లు గిరిజన ప్రాంతాల్లోని పీహెచ్‌సీలో వైద్య సేవ లు అందజేయాలి. లింగాలవలస పీహెచ్‌సీ రూరల్‌ ప్రాంతంలో ఉన్నప్పటికీ దానికి సమీపంగా కొన్ని గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇదే కారణంతో సదరు వైద్యుడు తనకు సర్వీసు పూర్తి కాకపోయినప్పటికీ ఐటీడీఏ అధికారుల నుంచి సర్టిఫికెట్‌ను సంపాదించి పీజీలో జాయిన్‌ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పీహెచ్‌సీకి ప్రస్తుతానికి ఎటువంటి ట్రైబల్‌ నోటిఫైడ్‌ కాలేదు. కొద్ది రోజుల తర్వాత ఈ విషయం బయపడింది. దీనిపై కొందరు గిరిజన ప్రాంతాల వైద్యులు వైద్య ఆరోగ్య శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై...ఆరోపణలు ఎదుర్కొంటున్న పీహెచ్‌సీ వైద్యుడి వద్ద ప్రస్తావించగా.. తాను పనిచేస్తున్న పీహెచ్‌సీ పరిధిలో అధికంగా గిరిజన గ్రామాలు ఉన్నాయని, ఐటీడీఏ లో నిర్వహించే ప్రతి ఆరోగ్య సమీక్షలకు హాజరయ్యేవాడినని, జీఓ ప్రకారమే సర్టిఫికెట్‌తో పీజీలో జాయిన్‌ అయ్యానని స్పష్టం చేశారు.

రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

శ్రీకాకుళం అర్బన్‌: ఆర్టీసీలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.అప్పారావు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోని సంఘ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పెన్షన్‌ సంబంధిత సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

చిన్నారి భువన్‌కు విరాళాల వెల్లువ

శ్రీకాకుళం క్రైమ్‌/పలాస: ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి షాక్‌కు గురై కుడి చేయి కోల్పోయిన మూడేళ్ల చిన్నారి భువన్‌ పట్ల దాతలు సహృదయత చాటుకున్నారు. చిన్నారి పడుతున్న కష్టానికి కనికరించి శనివారం నాటికి దాదాపు రూ.8 లక్షల 60 వేలు వరకు ఆర్థికంగా సాయపడ్డారు. ఈ నెల 4న వజ్రపుకొత్తూరు మండలం కొండవూరులో భువన్‌తో పాటు నాయనమ్మ అడ్డి తులసమ్మ విద్యుత్‌ షాక్‌కు గురైన సంగతి తెలిసిందే. ‘సాక్షి’ కథనాలతో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరగడంతో వివిధ గ్రామాల యువకులు, ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు, రైల్వే, విద్యుత్తు, ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులు చేయూత అందించారు. ప్రమాదం జరిగిన నాటినుంచి స్థానిక శ్రీ వేదసరస్వతీ దేవీ, శ్రీ గణేష్‌ యువజన సంఘాల యువత గ్రామస్తుల సహకారంతోనే కాకుండా బయట నుంచి కూడా వివిధ మార్గాల్లో విరాళాల సేకరించేందుకు కృషిచేశారు. రూ. 25 వేల నుంచి రూ.లక్షకు మించి ఇచ్చిన వారిలో కొండవూరు గ్రామస్తులు, వేదసరస్వతి, గణేష్‌ సంఘాల యువత, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం, మంచినీళ్లపేట సీమెన్‌ గ్రూప్‌, పూండి–గోవిందపురం కె.ఎం.వి.సేవా సమితి, పూండి–నౌపడ రైల్వే ట్రాక్‌మెన్స్‌, మహదేవపురం, కవిటి అగ్రహారం యువత, ఉద్యోగులు, కాశీబుగ్గ పవన్‌కళ్యాణ్‌ సేవాసమితి, పూండి యువతరం సేవాసమితి, మర్రిపాడు గ్రామస్తులున్నారు.

విద్యుత్తు విజిలెన్స్‌ విచారణ..

ప్రస్తుతం రాగోలు జెమ్స్‌లో చికిత్స పొందుతు న్న భువన్‌, తులసమ్మల వద్దకు విద్యుత్తు విజిలెన్స్‌ ఎస్‌ఐ రామారావు, సిబ్బంది వెళ్లి ప్ర మాదంపై విచారణ చేశారు. సంబంధిత నివేదికలను ఉన్నతాధికారులకు అందించి బాధితు లు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామన్నారు.

గిరిజన రైతుల ఆందోళన   
1
1/2

గిరిజన రైతుల ఆందోళన

గిరిజన రైతుల ఆందోళన   
2
2/2

గిరిజన రైతుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement