కుటుంబ సంక్షేమంపై దృష్టిసారించాలి
పర్లాకిమిడి: కుటుంబ సంక్షేమంపై సిబ్బంది దృష్టిసారించాలని అధికారులు అన్నారు. గజపతి జిల్లాలో మహిళా, శిశుఅభివృద్ధి శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలతో కన్వర్జెన్స్ సమావేశాన్ని కలెక్టరేట్ హాల్‌లో శుక్రవారం జరిగినది. ఏడీఎం ఫల్గునీ మఝి, జిల్లా పరిషత్ ఆదనపు కార్యనిర్వాహణాధికారి పృద్వీరాజ్ మండళ్, ప్రోగ్రాం, ప్రోటెక్షన్ అధికారిని సరలా పాత్రో, డీడబ్ల్యూవో మనోరమాదేవి పాల్ అంగన్‌వాడీ కేంద్రాల్లో శిశువులకు నెలసరి రేషన్, కిశోర్ దివాస్, బాలలకు పోషకాహార అద్వికా షెషన్సు ద్వారా సరఫరా, బాలలకు తరచూ హెల్త్, బరువు కోలతలు చేపట్టాలని ఏడీఎం మఝి సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు శుక్రవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, నూనె, బంగాళదుంపలు తదితర నెలకు సరిపడే నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలియజేశారు. ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీధర్ ఆచార్య ప్రతీనెలా ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. అదేవిధంగా వంద మంది అనాథ ఆదివాసీ పిల్లలను ట్రస్టు ద్వారా ఉచితంగా చదివించడంతో పాటు వారికి వసత, భోజన సౌకర్యాలను కల్పిస్తున్నారని తెలియజేశారు.
కుటుంబ సంక్షేమంపై దృష్టిసారించాలి


