12న ట్రేడ్ యూనియన్ సమ్మె
విజయవంతం చేయాలని నాయకుల పిలుపు
పర్లాకిమిడి: ఈ నెల 12వ తేదీన చేపట్టనున్న ట్రేడ్ యూనియన్ సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఇందులో భాంగా అఖల భారత ఖేత్ మజ్దూర్ సభ ఆధ్వర్యంలో జిల్లాలోని గుసాని సమితి ఉప్పలాడ సవరవీధిలో ఖేత్ మజ్దూర్ సభ అధ్యక్షులు తిరపతి గోమాంగో అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. వ్యవసాయ కూలీల ఇళ్లకు ఉచితంగా 300 యూనిట్ల కరెంటు, దినసరి కూలీ రోజుకు రూ.600, జంగిల్ జమ్మి పట్టాలు, ఆర్‌ఐ, అమీన్‌లు నెలకు కనీసం 15 రోజులు గ్రామాల్లో పనిచేసి జీ వీ జీ రాం జీ చట్టానికి బదులుగా మహాత్మాగాంధీ గ్రామీణ నిశ్చిత ఉపాధి పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్) అమలు చేయాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారులకు రూ.5 లక్షలు మంజూరు చేయాలని సమావేశంలో డిమాండ్‌చేశారు. ఈ డిమాండ్లతో ఈనెల 12న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌కు అందరూ సహకరించాల్సిందిగా కోరారు. సమావేశంలో మోజేష్ శోబోరో, కై లాస్ శోబోరో, మాథ్యూ రయితో, తమాస్ రయితో, మోహితీ మండల్, సంతోషి శోబోరో ఉన్నారు.
12న ట్రేడ్ యూనియన్ సమ్మె


