హత్య కేసులో నిందితుడి అరెస్టు
రాయగడ: ఈ నెల మూడో తేదీన జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధి శుండిపొదొరో గ్రామానికి చెందిన చిరిరామ్ బాగ్ (71) అనే వృద్ధుడు చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గుర్తు తెలియని దుండగులు అతనిని హత్య చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన సుఖదేవ్ బాగ్‌ను శనివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పాతకక్షలతో పాటు చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో చిరిరామ్ బాగ్‌ను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని ఐఐసీ కల్పన బెహర తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
రాయగడ: జిల్లాలోని కొలనార అగ్నిమాపక కేంద్రం సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతులు చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనకాబడి గ్రామానికి చెందిన జగన్నాథ సరక (32), బొడొపొదియారి గ్రామానికి చెందిన మహేష్ బిడిక (31)లుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. బైకులపై వస్తున్న ఇద్దరు కొలనార వద్ద గల అగ్నిమాపక కేంద్రం సీమీపంలో ఎదురెదురుగా ఢీకోవడంతో ప్రమాదం జరిగింది.తీవ్రగాయాలకు గురైన వీరు అక్కడిక్కడే మృతి చెందారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం
రాయగడ: సదరు సమితి పితామహల్ పంచాయతీలోని దుశారిగుడ గ్రామానికి చెందిన సునీల్ హిమిరిక (40) అనే యువ కుడు ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. పితామహాల్ –సిరికొన బైపాస్ ప్రధాన రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రహదారిని దాటుతుండగా వేగంగా వచ్చిన ఒక బైకు అతడిని బలంగా ఢీకొంది. దీంతో సంఘటన స్థలం వద్దే హిమిరిక మృతి చెందాడు. అయితే ఢీకొట్టిన బైకు చోదకుడు సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తు గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు చేపట్టిన ఆందోళన ఫలితంగా ఆయా మార్గంలో గల వాహనాల రాకపోకలు నిలిచిపొయాయి. సమాచారం తెలుసుకున్న శెశిఖాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పితామహల్ పంచాయతీ సర్పంచు టుటు తాడింగి సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులతో మంతనాలు చేశారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించే విధంగా కృషి చేయడంతో పాటు ఢీకొట్టి వెళ్లిన బైకు చోదకుడిని కూడా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పరి స్థితి అదుపులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ ఆద్వర్యంలో ఈ ఆదివారం స్థానిక పాఠశాల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం మనుషులు తమ పనిభారం తగ్గించుకోవడానికి సాంకేతికతపై ఆధారపడుతున్నారు. అన్ని ముఖ్యమైన పనులు ఇంటర్నెట్, కంప్యూటర్ ద్వారా చాలా తక్కువ సమయంలో పూర్తవుతున్నాయి. అయితే ఈ సమయంలో అందరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు. కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా సైబర్ నేరగాళ్ల మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
హత్య కేసులో నిందితుడి అరెస్టు


