ధాన్యం కొనుగోలు చేసేదెప్పుడు?
● టోకెన్ల గడువు ముగుస్తున్నా పట్టించుకోవడం లేదు ● సిబ్బంది పనితీరుపై రైతుల అసంతృప్తి
జయపురం: ధాన్యాన్ని అమ్మేందుకు రైతులకు ఇచ్చి న టోకెన్ల గడువు ముగుస్తున్నా.. కొనుగోలు చేయటం లేదని జయపురం సమితి కుములి గ్రామ పంచాయతీ రైతులు ఆరోపించారు. జిల్లా పౌర సరఫరాల అధికారికి పలువురు రైతులు సోమవారం ఫిర్యాదు చేశారు. మండీలకు ధాన్యం తీసుకువచ్చి నా కొనుగోలు చేయడం లేదని పౌర సరఫరాల అధికారి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మండీలలో ఉన్న ధాన్యం కోసం సంచులు, ధారాలు సమకూ ర్చాలని జిల్లా ప్రధాన పౌర సరఫరాల అధికారి గతంలో తెలియజేసినప్పటికీ.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ ధాన్యం మండీలలో పడి ఉన్నాయన్నారు. తాము ఆర్థికపరమైన సమస్యలు ఎదురుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్ల క్ష్యం పట్ల తగిన చర్యలు తీసుకొని, టోకెన్ల గడువు ముగియక ముందే ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.


