సాంకేతిక పరిజ్ఞాన ‘ప్రవాహ్’ం
డ్) సెమీకండక్టర్లపై దృష్టి సారించి ముందంజలో దూసుకుపోతుందని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రవాహ్‌లో రిజిస్ట్రేషన్లు 10 రెట్లు పెరిగాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అప్లైడ్ మెటీరియల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రిన్సిపల్ టెక్నాలజిస్ట్ డాక్టర్ సూరజ్ రంగరాజన్ టెక్ టాక్ ప్రసంగం విద్యార్థులు, ఇన్‌స్టిట్యూట్ సభ్యులను చైతన్యవంతం చేసింది. ఏఐ ఆన్ ట్రయల్ పుస్తక రచయిత, రాజ్య సభ సభ్యుడు సుజీత్ కుమార్ ప్రసంగం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, విధానం, వాటి సామాజిక ప్రభావంపై లోతుగా ఆలోచింపజేసింది. డేటా సైన్స్ హ్యాకథాన్, జనరల్ క్విజ్, మార్కటస్ బిజినెస్ ఛాలెంజ్, ఫ్యాషన్ షో, స్టార్టప్ ఎక్స్‌పో, రోబో సాకర్, సాంస్కృతిక ప్రదర్శనలు, స్టార్ నైట్ వంటి విభిన్న కార్యక్రమాల సముచిత మేళవింపు ప్రవాహ్ ఉత్సవం సాంకేతికత, వ్యవస్థాపకత, సంస్కృతి సమన్వయం ప్రదర్శించింది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణవ్ శర్మతో కామెడీ ప్రవాహ్ ఉత్సవంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఉత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీపాద కర్మల్కర్, విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ దాక్టరు రాజేష్ రోషన్ దాష్, ప్రవాహ్ చైర్‌పర్సన్ డాక్టర్ జి.సంతోష్ కుమార్, స్టూడెంట్ జింఖానా అధ్యక్షుడు డాక్టర్ కోదండ రామ్ మంగిపూడి, ప్రవాహ్ సహ చైర్‌పర్సన్ డాక్టర్ బంకిమ్ చంద్ర మహంత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి కందుల జోజి కుమార్ ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించాడు.
భువనేశ్వర్: క్రానికల్స్ ఆఫ్ టైమ్ ఇతివృత్తంతో భువనేశ్వర్‌లోని భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) సంయుక్త సాంస్కృతిక, టెక్నోప్రెన్యూర్‌షిప్ వార్షిక ఉత్సవం ప్రవాహ్ ఉత్సాహంగా సాగింది. నాలుగు రోజుల పాటు జరిగిన ప్రవాహ్ కార్యక్రమం సాంకేతికత, సంస్కృతి, వ్యవస్థాపకత సంగమాన్ని ప్రతిబింబించింది. ప్రవాహ్ ప్రభావవంతమైన ఆలోచనలతో ఆవిష్కరణలకు ప్రాణం పోసి ఆధునిక యుగాలకు మార్గదర్శకంగా ప్రేరేపిస్తుందని వక్తలు అభినందించారు.
ప్రవాహ్ ప్రత్యేకం
సాంకేతికత, సంస్కృతి, వ్యవస్థాపకతలను విలీనం చేసి ప్రవాహ్ జాతీయ స్థాయిలో ప్రత్యేకత సంతరించుకుందని డైరెక్టర్ ప్రొఫెసర్ కర్మల్కర్ ప్రశంసించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా దేశంలోని ఇతర రాష్ట్రాలు ఎలిమెంటల్ సెమీకండక్టర్ తయారీపై దృష్టి సారిస్తుండగా ఒడిశా సమ్మేళన (కాంపౌం
సాంకేతిక పరిజ్ఞాన ‘ప్రవాహ్’ం


