గూడ్స్ ఇంజిన్‌లో మంటలు
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ రైల్వే స్టేషన్ సమీపంలో బొగ్గు లోడుతో ఉన్న గూడ్స్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. శనివారం మధ్యాహ్నం రాయగడ నుంచి టిటలాఘడ్ వైపు వెళుతున్న గూడ్స్ ట్రైన్ బిసంకటక్ స్టేషన్‌కు సమీపంలో లయన్ క్లియర్ లేక నిలిచిపోయింది. అదే సమయంలో ఇంజిన్ భాగంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే బిసంకటక్ రైల్వే స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. అనంతరం బిసంకటక్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. ట్రైన్ ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యా పించినట్లు ప్రాథమిక దర్యాప్తులో భావిస్తున్నారు. రెండు గంటల అనంతరం టిట్లాఘడ్ వైపు ట్రైన్ బయలు దేరింది.


