టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ప్రహరీ వద్ద సోమవారం గుర్తు తెలియని యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రహరీ లోపలి భాగంలో గోడ కంటే ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్‌ను గోడపైకి ఎక్కి పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురైనట్లు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాము ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదని, సుమారు 38 ఏళ్లు ఉంటాయన్నారు. ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని కోరారు. అనంతరం మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పశువులు పట్టివేత
రణస్థలం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు 5 బొలేరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 14 పశువులను జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి పట్టుకొని కేసు నమోదు చేశారు.


