నిలిచిపోయిన బియ్యం లారీలు
పలాస: పలాస మండలం లొద్దబద్ర గ్రామం వేర్ హౌస్ గోడౌన్ వద్ద గత మూడు రోజులుగా బియ్యం లారీలు నిలిచిపోయాయి. అన్‌లోడింగ్ కోసం లారీ డ్రైవర్లు అక్కడే నిద్రాహారాలు మాని కాచుకుని ఉన్నారు. కొంతమంది లారీలను అక్క డే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. వారం రోజుల కిందట జిల్లాలోని వివిధ మిల్లర్లకు శ్రీకాకుళం ఎఫ్‌సీఐ డీఎం నుంచి వారికి ఆర్డరు కాపీలు అందాయి. పలాస మండలం లొద్దబద్ర తీసుకొని వెళ్లమని తెలియజేశారు. దీంతో నరసన్నపేట, టె క్కలి, నందిగాం, పలాస, సోంపేట, కోటబొ మ్మాళి తదితర ప్రాంతాల నుంచి బియ్యం లారీ లు గత నెల 26 నుంచి క్యూకట్టాయి. మొదటి రోజు కొన్ని లారీలు ఆన్‌లోడింగ్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో అక్కడ ఉన్న లారీల బియ్యాన్ని దించవద్దని అక్కడ సిబ్బందికి ఆదేశాలు రావడంతో అన్ లోడింగ్‌ను ఆపేశారు. దీంతో అప్పటి నుంచి మూడు రోజుల నుంచి అక్కడే లారీలతో బియ్యం ఉంటున్నాయి. ప్రస్తుతం ఆదివారానికి 35 లారీల బియ్యం ఉన్నాయి. బయట రోడ్డు మీద కూడా మరో పది వరకు ఉన్నాయి. తప్పని పరిస్థితిలో ఆ బియ్యం లారీలు వెనక్కి వెళ్లలేక, అక్కడ దించలేక డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. లారీలు అక్కడ నిలిచిపోవడంతో రోజుకు రూ.10వేలు నష్టం అవుతోందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రికి చెందిన లారీ డ్రైవరు యాకూబ్ మాట్లాడుతూ మూడు రోజులుగా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చిందని, వంట చేసుకొని తింటున్నామని, కనీసం మంచి నీరు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై పలాస వేర్ హౌస్ గొడౌన్ మేనేజరు శ్రీనివాసరావును వివరణ కోరగా తమకు ఇంకా విజయవాడ నుంచి ఆర్డరు కాపీ రావాల్సి ఉందని, అది వస్తే ఈ సమ స్య పరిష్కారం అవుతుందని తెలిపారు.


