●రంగంలోకి తనిఖీ బృందాలు
జిల్లాలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు విశాఖ నుంచి వచ్చిన పుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని హోటల్స్, పాస్ట్‌ఫుడ్స్ సెంటర్లు, స్వీట్‌షాపులను తనిఖీ చేస్తున్నారు. నగరంలోని ఓ హోటల్‌లో ఫుడ్ శాంపిల్స్ తీసి ఇప్పటికే హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు. మరికొన్ని హోటల్స్‌లో 15 ఇన్‌ఫార్మల్ శాంపిల్స్ తీశారు. లైసెన్సు లేకుండా నడుతున్న 10 హోటళ్లకు 31 నోటీసులు జారీ చేయగా, పరిశుభ్రంగా లేని 15 హోటళ్లకు 32 నోటీసులు జారీ చేశారు. రంగుల్లేకుండా గడువు ముగిసిన వస్తువులు వాడకుండా చర్యలు తీసుకోవాలని హోటళ్లు, షాపుల నిర్వాహకులకు ఆదేశించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీ నారాయణతో పాటు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు కె.లక్ష్మీ, శ్రీరామమూర్తి, ఆనందరావు తదితరులు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు సాగుతున్నాయి.


