డయేరియా కట్టడిలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

డయేరియా కట్టడిలో ప్రభుత్వం విఫలం

Mar 1 2026 7:42 AM | Updated on Mar 1 2026 7:42 AM

డయేరి

డయేరియా కట్టడిలో ప్రభుత్వం విఫలం

డయేరియా కట్టడిలో ప్రభుత్వం విఫలం ఎవరి పనులు వారు చేయకే ఈ దుస్థితి ● మున్సిపల్‌ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం నాణ్యత కొరవడితే చర్యలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న మెడికల్‌ మాఫియా ప్రజల జీవించే హక్కుపై పరోక్షంగా దాడి చేస్తోందని, నాణ్యత లేని బోగస్‌ మందులు విచ్చలవిడిగా మార్కెట్లో ప్రవేశించి వేలాదిమంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో విస్తృతంగా వ్యాపిస్తున్న డయేరియా కేసులను కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్నారు. శనివారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు అవసరం లేని టెస్టులు, శస్త్ర చికిత్సలు సూచిస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొత్స సంతోష్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, సీపీఐ నాయ కులు చిక్కాల గోవిందరావు, పైడి గోవిందరా వు, ఏఐవైఎఫ్‌ నాయకులు ఆర్‌.అరవింద్‌, వై. వేణు, వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం: ‘ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సిన వారు ఎందుకు విఫలమవుతున్నారు? ఎవరు చేయాల్సిన పనులు వారు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది..’అంటూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మున్సిపల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు ఎమినిటీ స్‌ సెక్రటరీలు, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు, శాని టరీ ఇన్‌స్పెక్టర్లతో కలెక్టర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మంచినీటి సరఫరా వ్యవస్థలో లోపాలు, అక్రమ పైపులైన్‌ కనెక్షన్ల విషయంలో అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. పారి శుధ్య నిర్వహణలో వైఫల్యాలు కనిపిస్తున్నాయని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్లే డయేరియా వంటి సమస్యలు తీవ్రమవుతున్నా యని అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్ల క్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ పైపులైన్ల లీకేజీలు, మురుగునీటి కాలువల పూడికతీత పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్‌(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో అమృత్‌భారత్‌ రైల్వేస్టేషన్‌ కింద నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని రైల్వేశాఖ ఏడీఆర్‌ఎం కె.రామారావు కాంట్రాక్టర్లను హెచ్చరించారు. రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల ను శనివారం పరిశీలించారు. స్టేషన్‌ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో స్టేషన్‌ మేనేజర్‌ బి.జనార్దనరావు, ఏడీ ఈఎన్‌ వి.ఎస్‌.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

డయేరియా కట్టడిలో  ప్రభుత్వం విఫలం 1
1/1

డయేరియా కట్టడిలో ప్రభుత్వం విఫలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement