క | - | Sakshi
Sakshi News home page

Mar 1 2026 7:42 AM | Updated on Mar 1 2026 7:42 AM

క

క భద్రతకు పటిష్ట నిఘా రిముఖ గణపతికి లముల పూజ ఆధార్‌ సేవలు న్యాయ సహాయం

నగరంలో తాజా పరిస్థితి

ప్రభావిత ప్రాంతాలు

దమ్మల వీధి, కాకి వీధి,

మంగువారితోట, గుడి వీధి

మొత్తం కేసులు

190

ప్రభావిత ప్రాంతాల నుంచి

05

వివిధ ఆసుపత్రుల్లో చికిత్స

87

డిశ్చార్జిలు

103

నగర వ్యాప్తంగా

(ప్రభావిత + సాధారణ వీధులు కలిపి)

శనివారం నమోదైన

కొత్త కేసులు:

ప్రస్తుతం చికిత్స 51

పట్టుబడిన మాదకద్రవ్యాల

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో పట్టుబడిన మాదకద్రవ్యాలను (ఎన్‌డీపీఎస్‌) అత్యంత భద్రంగా నిల్వ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా శనివారం వంశధార పాత క్వార్టర్స్‌లోని భవనాలను జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, ఏఎస్పీ శ్రీనివాసరావు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇకపై స్వాధీనం చేసుకున్న గంజాయి, ఇతర డ్రగ్స్‌ను భద్రపరిచేందుకు వీలుగా ఒక భవనాన్ని గుర్తించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భవనం చుట్టూ అత్యున్నత స్థాయి భద్రత ఉండాలని, రాత్రి వేళల్లో కూడా పరిసరాలన్నీ స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్‌ లైట్లను అమర్చాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌డీపీఎస్‌ కేసుల్లో పట్టుబడిన మాదకద్రవ్యాలను కోర్టు విచారణ పూర్తయ్యే వరకు, డిస్పోజల్‌ కమిటీ నిర్ణయం తీసుకునే వరకు సురక్షితంగా ఉంచడం కీలకమన్నా రు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ, పోలీస్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ టైలర్స్‌ డే

శ్రీకాకుళం కల్చరల్‌: నగరంలోని చిన్నబజారు జంక్షన్‌ వద్ద స్టైలెక్స్‌ టైలర్స్‌ ఆధ్వర్యంలో ప్రపంచ టైల ర్స్‌ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా విలియం హావే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు టైలర్లు మాట్లాడుతూ రెడీమేడ్‌ దుస్తులు ఎక్కువ కావడంతో.. టైలర్లకు పండగ రోజుల్లో కూడా పనులు లేక ఇబ్బంది పడుతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో గుంటముక్కల పాపారావు, శ్రీనివాస్‌ పంట, లిబర్టీ రమణ, రాజు, వేణు, భోగేశ్వరరావు, బాబూరావు, గణేష్‌, ఏ వన్‌ రాజు టైలర్‌, రోజీ టైలర్‌ తిరుమల పాల్గొన్నారు.

పోస్టాఫీసుల్లో

శ్రీకాకుళం అర్బన్‌ : శ్రీకాకుళం పోస్టల్‌ డివిజన్‌ పరిధిలో 19 తపాలా కేంద్రాల్లో పూర్తిస్థాయి ఆధార్‌ సేవలు లభిస్తున్నాయని పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వి.హరిబాబు శనివారం తెలిపారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలి ప్రధాన కార్యాలయాలతో పాటు రాజాం, పొందూరు, ఎస్‌.ఆర్‌.పురం, జె.ఆర్‌.పురం, అరసవల్లి, గార, హిరమండలం, కొత్తూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, కాశీబుగ్గ, పలాస, సోంపేట, మందస, ఇచ్ఛాపురం, గుజరాతిపేట సబ్‌ పోస్టాఫీసుల్లో ఈ సేవలు లభిస్తాయని వివరించారు. కొత్త ఆధార్‌ నమోదుతో పాటు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌, ఈ–మెయిల్‌ ఐడీ వంటి వివరాల్లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ (ఫోటో, వేలిముద్రలు, ఐరిస్‌), పిల్లల తప్పని సరి ఆధార్‌ నవీకరణ, డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ వంటి సదుపాయాలు అన్ని వయసుల వారికి అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లతో

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ల ద్వారా న్యాయపరమైన సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రశాంతి వృద్ధాశ్రమం, ఎంపీఆర్‌ న్యాయ కళాశాలలోని లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చాలామంది చిన్నపాటి సమస్యలను పెద్దగా భావించి న్యాయస్థానాల సహాయాన్ని పొందడానికి ముందుకు రారని, అలాంటి వారికి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లు అండగా నిలుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, ఎంపీఆర్‌ న్యాయ కళాశాల కళాశాల ప్రిన్సిపాల్‌ కె.మోసే తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లా కేంద్రంలోని నానుబాలవీధిలో విజయగణపతి ఆలయం వద్ద శనివారం 5008 పెన్నులతో పూజలు చేశారు. ఆదివారం ఉదయం 8.30 నుంచి 11గంటల వరకూ విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేస్తామని అర్చకులు పెంట శ్రీధర్‌శర్మ, పెంట సూరనగేష్‌శర్మ తెలిపారు.

క1
1/4

క2
2/4

క3
3/4

క4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement