శ్రీకాకుళం 7రోడ్ల జంక్షన్ వద్ద
టీమిండియా విశ్వ విజేతగా ఆవిర్భవించింది. అభిషేక్ మెరుపు షాట్లు, శాంసన్ కళాత్మక స్ట్రోక్‌లు, ఇషాన్ దూకుడు, ఆఖరి ఓవర్‌లో దూబె దంచుడును జిల్లాలోని క్రికెట్ అభిమానులు ఆస్వాదించారు. గురి తప్పని బుమ్రా యార్కర్లు, అక్షర్ పటేల్ వికెట్ల దండయాత్రను తనివి తీరా చూసి తరించారు. టీ20 క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను జిల్లాలో టీవీలతో పాటు తెరలు కట్టి చూశారు. జిల్లా కేంద్రంలో సినిమా హాల్‌లో సైతం మ్యాచ్‌ను ప్రదర్శించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా కప్ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ సూర్య కప్ అందుకున్న క్షణాలను కనులారా చూసి వేడుక చేసుకున్నారు.
– శ్రీకాకుళం న్యూకాలనీ, సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం
జీటీ రోడ్‌లో..
నరసన్నపేట: కోమర్తి కాలనీ వద్ద
శ్రీకాకుళంలోని ఓ థియేటర్‌లో మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు


