ఒళ్లు గగుర్పొడిచేలా.. | - | Sakshi
Sakshi News home page

ఒళ్లు గగుర్పొడిచేలా..

Mar 9 2026 7:17 AM | Updated on Mar 9 2026 7:17 AM

● ఆటోను ఢీకొన్న కారు

● ఒకరు మృతి.. 9 మందికి గాయాలు

ఎచ్చెర్ల: ఎచ్చెర్ల సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వత్సవలస జాతరకు వచ్చిన భక్తులు ఆటోలో తిరి గి వెళ్తుండగా కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన దృశ్యాలు ఒళ్లు గగుర్పా టు కలిగించే విధంగా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం ముషినివాడ నుంచి ఆటోలో గార మండలంలోని వత్సలవలస యాత్రకు శనివారం రాత్రి సమయంలో వచ్చిన వారు తిరిగి వెళ్తుండగా ఎచ్చెర్ల సమీపంలో వెనుకనుంచి వచ్చి న కారు వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రమేష్‌ (41) మృతి చెందగా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన వారిలో ధర్మ వరపు చిన్నిగవరశెట్టి, పార్వతి, గౌతమి, తులసిరెడ్డి, గణపతి, నాగరాణి, తామాడ ధనలక్ష్మీ, తామాడ భారతి, పూడివలస త్రివేణి, మరో పాప ఉన్నారు. వీరిని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు.

ఉదయం 11.48.44కి జాతీయ రహదారిపై..

11.48.45కు

నుజ్జునుజ్జయిన ఆటో

సపర్యలు చేస్తున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement