జగన్‌తోనే సాధ్యం | - | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే సాధ్యం

Mar 9 2026 7:17 AM | Updated on Mar 9 2026 7:17 AM

మహిళా

సాధికారత

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): మహిళా సాధికారత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచిన 50శాతం మహిళా రిజర్వేషన్‌ అమలుచేసిన ఘనత వైఎస్సార్‌సీపీదేనన్నారు. వైఎస్సార్‌ సీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి అధ్యక్షతన ప్రపంచ మహిళా దినోత్సవం శ్రీకాకుళం టౌన్‌హాల్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కుటుంబాలు బాగు ప డాలంటే భార్యాభర్తలు సక్రమంగా కలిసి ఉండాలని, అప్పుడే అభివృద్ది సాధ్యపడుతుందన్నారు. మన దేశం జనాభా పరంగా ప్రపంచంలోనే ముందుంటే చంద్రబాబు ముగ్గురు పిల్లలు కనాలని చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు మాత్రం ఒక్కరినే కని ఆస్తులు, డబ్బులిచ్చి ధనవంతుల లిస్ట్‌ లో ఉంచేందుకు తాపత్రయ పడతారని మండిపడ్డా రు. తన పాదయాత్రలో ఇల్లు లేని పేదలను చూసిన జగన్‌ తాను అధికారంలోకి వచ్చాక వారికి భూమి ఇచ్చి ఇళ్లు కట్టిచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం 40 ఏళ్లలో ఒక్క సెంటు భూమైనా ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన సంక్షేమాలన్నీ చంద్రబాబు ధ్వంసం చేశారని, రైతుకి బస్తా యూరి యా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి వచ్చారని తెలిపారు. ఇసుక, భూములు యథేచ్ఛగా దోచుకోవడమే ఎమ్మెల్యేల వృత్తిగా మారిందన్నారు. జిల్లా కేంద్రంలో 8 మంది డయేరియాతో మృతి చెందితే ఇద్దరికి ఎక్స్‌గ్రే షియా ఇచ్చి మమ అనిపించేయడం సరికాదన్నారు.

ఈ సందర్భంగా రుప్ప దివ్య, అంబటి నిర్మల, పి.సుగుణారెడ్డి, మజ్జి సుధాబాల, మూకళ్ల సుగుణలు మాట్లాడుతూ టీడీపీ కార్యక్రమాల్లో గాని పార్టీలో గానీ మహిళల ఆచూకీ లేదని అన్నారు. 2004లో దివంగత వైఎస్సార్‌కి ఇళ్ల పట్టాలు మహిళల పేరిట ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ పార్లమెంటరీ పరిశీలకులు కుంభా రవిబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, కళింగవైశ్యకుల రాష్ట్ర అధ్యక్షులు, పార్టీ నరసన్నపేట నియోజకవర్గ పరిశీలకులు అంధవరపు సూ రిబాబు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్‌, తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్‌, వెలమకుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, యువ నాయకులు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, తమ్మినేని చిరంజీవినాగ్‌, ఎస్‌ఈసి మెంబర్లు గొండు కృష్ణ, చల్ల శ్రీనివాసరావు, మైనార్టీ సెల్‌ విభాగం జిల్లా అధ్యక్షులు ఎం.ఏ భేగ్‌, గ్రీవెన్స్‌సెల్‌ జిల్లా అధ్యక్షులు రౌతు శంకరరా వు, మండవల్లి రవి, మూకళ్ల తాతబాబు, పార్టీ నియోజకవర్గాల మహిళా అధ్యక్షురాలు మానస, గురుబెల్లి వెంకట రమణమ్మ, సత్తారు ఉషారాణి, పండా సుజాత యాదవ్‌, చిగురుపల్లి ధనలక్ష్మి, కాగాన సుశీల, ఆశాలత గుప్తా, హేమలత, చల్లా అలివేలు మంగా, గుంట జ్యోతి, ఆట్ల సరోజనమ్మ, మాధవిలత తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

మహిళలు కదంతొక్కే రోజులు దగ్గరపడ్డాయి: మాజీ మంత్రి సీదిరి

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

జగన్‌ హయాంలోనే పదవులు

వైఎస్‌ జగన్‌ హయాంలోనే మహిళలకు 50 శాతం పదవులు వచ్చా యి. వీధి బడుల స్వరూపాలన్నీ మారాయి. కేంద్రం 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి పాట్లు పడుతుంటే జగనన్న అంతకుమించి ఇచ్చారు.

– పిరియా విజయ సాయిరాజ్‌, జెడ్పీ చైర్‌ పర్సన్‌

చంద్రబాబువి మాయ మాటలు..

చంద్రబాబు ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పారు. సున్నావడ్డీ, చేయూత, ఆసరా, సన్నావడ్డీ పథకం, ఇళ్ల పట్టాలు అన్నీ ఎగ్గొట్టేశారు. చంద్రబాబుకు మహిళలు తగిన గుణపాఠం చెబుతారు. – ఉలాల భారతీదివ్య, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు

సృష్టికి మూలం మహిళలే

సృష్టికి మూలం మహిళ. దివంగత వైఎస్సార్‌ ప్రతి ఒక్కరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటే.. ఆయన తనయుడు మరో పది అడుగులు ముందుకేసి మహిళలకు పెద్దపీట వేసి గౌరవించారు. – తమ్మినేని వాణిశ్రీ, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సతీమణి

టీడీపీ మోసాలు వివరిద్దాం

టీడీపీ మోసాల్ని, చంద్రబాబు అరాచకాల్ని అందరికీ వివరిద్దాం. ఇంటా, బయట పనిచేసి కుటుంబాల్ని ముందుకు తీసుకెళ్లగలిగే శక్తి మహిళలకే ఉంది. చంద్రబాబు మహిళలకు చేసిన మోసాల్ని అన్ని గ్రామాల్లో వివరించాలి. – ఎంవీ పద్మావతి,

వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు

జగనన్నను గెలిపిద్దాం..

2024లో చంద్రబాబు రావడం వల్లే మహిళలు ఈ రోజు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మళ్లీ జగనన్నను గెలిపించుకుందాం. మహిళలకు అన్ని అవకాశాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

– దువ్వాడ వాణి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు

కేక్‌ కట్‌ చేస్తున్న వైఎస్సార్‌ సీపీ మహిళా నాయకులు

మహిళలు కదం తొక్కుతారు

వైఎస్సార్‌ సీపీ హయాంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్ర చరిత్ర మొత్తంలో 44 లక్షల ఇళ్లు ఇస్తే వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలోనే 33.50 లక్షల ఇళ్లు ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రకటనల్లో చంద్రబాబు, లోకేష్‌ ఫొటో లు తప్ప మహిళా, శిశు సంక్షేమ మంత్రి సంధ్యారా ణి ఫొటో లేకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. చంద్రబాబు వైఫల్యాలపై మహిళలు కదం తొక్కుతారు.

– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి

దిశ వంటి చట్టాలు కావాలి

రాష్ట్రంలో మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది. జగనన్న దిశ యాప్‌ తీసుకొ చ్చారు. అలాంటి చట్టాలు మళ్లీ అమలు కావాలి.

– సీదిరి శ్రీదేవి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement