● మత్స్యకారులను మోసగించిన ఘనులు
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు
రణస్థలం: మనం మనం మత్స్యకారులం.. అంటూ ఓ ప్రబుద్ధుడు రూ.కోట్లు కాజేశాడు. స్థానిక మత్స్యకార గ్రామాలకు చెందిన వందలాది మంది లక్షలా ది రూపాయలు కట్టి మోసపోయిన ఘటన రణ స్థలం మండలంలో సంచలనమైంది. నగదు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం, కొత్తవారిని చేర్పి స్తే కార్లు, విల్లాలు కానుకలు ఇస్తామని నమ్మించి అమాయకులపై వల వేశారు. జేఆర్ పురం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు... విశాఖప ట్నం కార్పొరేషన్, పెద్ద జాలరిపేటకు చెందిన కొ మర జగన్నాథ రావు (జగదీష్), జిల్లాలోని కొవ్వా డ గ్రామానికి చెందిన సూరాడ రాముడు (కిశోర్) అనే ఇద్దరు రణస్థలం మండలంలోని కోష్ట జంక్షన్‌లో 2024లో పాతర్లపల్లి రోడ్‌లోని ఒక రూమ్ తీసుకుని ఒక ఆఫీసులా నడపసాగారు. మత్స్యకారులకు ఓ యాప్‌ను చూపించి ‘యూనిట్ మెటా టోకెన్’ కంపెనీలో అధిక లాభాలు అంటూ పెట్టుబడులు పెట్టించారు. కొమర జగన్నాథరావు భార్య కొమర లక్ష్మి అకౌంట్‌లో అధికంగా డబ్బులు వేయించుకున్నారు. రూ.లక్షకు పైచిలుకు పెట్టుబడి పెడితే నెలకు రూ.12 వేలు, మళ్లీ రూ.లక్షకు వడ్డీ కూడా ఇస్తామని ఆశ చూపించారు. ఇలా ప్రతి ఒక్కరికీ రెండేసి, మూడేసి నెలలు వేసి ఆపై టెక్నికల్ సమస్య వచ్చింది మీ డబ్బులు ఎటూ పోవు అంటూ నమ్మించారు. అలా నెలలు గడిపేశారు. వీరి లో సూరాడ రాముడు తన తల్లిదండ్రులతోనే రూ. రెండు లక్షలు కట్టించాడు. తల్లిదండ్రులు అడిగితే ‘మన డబ్బులు పోవు మీరు గ్రామస్తులతో వెళ్లకండి’ అని గదమాయించడం విశేషం.
ఒక్క కొవ్వాడలోనే రూ.కోటిన్నర
కొవ్వాడ మత్స్యకార గ్రామానికి చెందిన బడి ఎర్ర య్య, రాముడు, మైలపల్లి పాపారావు, కృష్ణంరాజు, సూరాడ జూస్‌బాబు ఇలా సుమారు 30 మందికి పైగా బాధితులు రూ. 46లక్షలకు పైచిలుకు పెట్టుబడులు పెట్టి మోసపోయారు. ఒక్క కొవ్వాడలోనే రూ.కోటిన్నర వరకు ఉంటుందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఇంకా పోలాకి మండలంలోని పలు మత్స్యకార గ్రామాలు, విజయనగరం జిల్లా చింతపల్లి మత్స్యకార గ్రామం, విశాఖపట్నం వంటి పట్టణాల్లో వందలాది మంది దగ్గర నాలుగైదు కోట్లకు పైగా టోకరా వేసినట్లు సమాచారం.
దిక్కున్న చోట చెప్పుకోండని..
సూరాడ కిశోర్, కొమర జగన్నాథరావులను గ్రామస్తులు మూడు నెలల క్రితం గట్టిగా నిలదీయడంతో రాజాం మండల కేంద్రంలో బాధితులు, గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టించారు. ఆరు మాసాల్లో ఇస్తామని ఈ లోగా చెక్కులు ఇస్తామని రూ. 20 బాండ్ పేపర్ మీద రాసి చెక్కులు ఇవ్వలేదు. దీంతో సూరాడ రాముడు(కిశోర్) కారును గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయన తన కారును బలవంతంగా తీసుకున్నారని విశాఖలోని అరిలోవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులంతా అక్కడకు వెళ్లి జరిగిందంతా చెప్పా రు. అయినా లాభం లేకపోవడంతో బాధితుల తరఫున గ్రామ పెద్దలు మైలపల్లి పోలీసు, అల్లిపల్లి రాముడు, మైలపల్లి పట్టయ్య, సత్యం జేఆర్ పురం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.


