శ్రీకాకుళం కల్చరల్: మహిళా సాధికారతకు సంబంధించి వివిధ పథకాల అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గర్వంగా ప్రకటించారు. ఆదివారం అంతర్జాతీ య మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హా జరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా సంఘాలకు రూ. 2266 కోట్ల క్రెడిట్ లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రూ. 312 కోట్లు, ఉన్నతి పథకం కింద రూ. 7 కోట్లు అందించామని తెలిపారు. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖ మహిళా భ ద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ ‘శక్తి యాప్’ ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, మెప్మా పీడీ, డీఆర్డిఏ పీడీ కిరణ్ కుమార్, ఎల్‌డీఎం శ్రీనివాసరావు మహిళా అ ధ్యక్షురాలు గంగమ్మ, ఐసిడిఎస్ పిడి రూపవతి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
ఘనంగా రాజమ్మ తల్లి జాతర
గార: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం వత్సవలస రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి ఆరో వారం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ కుటుంబ సభ్యులుతో రాజమ్మ తల్లికి మొక్కలు తీర్చుకునేందుకు వచ్చారు. శనివారం రాత్రికే వచ్చిన భక్తులు సమీప తో టల్లోనూ, ఆరుబయట బసచేసి రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి) పాటు భూలోకమ్మ తల్లికి ఆది వారం ఉదయం మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జామున నుంచే సమీపంలోని సముద్రంలో స్నానాలాచరించారు. ఆదివారం వేకువజామునుంచే అధిక సంఖ్యలో సముద్రస్నానాలు ఆచరించగా, ఎస్‌ఐ చోడిపల్లి గంగరాజు, మైరెన్ సీఐ బూర ప్రసాదరావులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
కంబిరిగాంలో
ఆక్రమణల గుర్తింపు
పలాస: పలాస మండలం కంబిరిగాం గ్రామంలో గల సర్వే నెంబరు 18లో 18 సెంట్ల భూమి ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇక్కడి ఆక్రమణలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఆదివారం ఉదయం కాశీబుగ్గ పోలీసుల సహకారంతో పలాస తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, ఆర్‌ఐ ప్రసాద్, సర్వే సిబ్బంది అక్కడకు వెళ్లి పరిశీలించారు. బట్టికి సంబంధించి గతంలోనే 10 సెంట్లు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. అలాగే వట్టికూల మాధవరావు 6 సెంట్లు, చెల్లూరు మల్లేశ్వరరావు 2 సెంట్లు ఆక్రమించినట్లు గుర్తించారు. ఇద్దరు రైతులు మట్టి తవ్వేందుకు అనుమతి తీసుకున్నారని, అయితే కొన్ని ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వగా మొత్తం 3 జేసీబీలు, 10 ట్రాక్టర్లను ఉపయోగించారని అందుకే వాటిని అడ్డుకొని మొత్తం వాహనాలను సీజ్ చేశామని కల్యాణచక్రవర్తి చెప్పారు. మట్టి తవ్వకాల అనుమతులను కూడా రద్దు చేశామని చెప్పారు.
వ్యాన్ ఢీకొని ప్రధాన పైపులైను ధ్వంసం
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయం సమీపంలో ప్రధాన నీటి సరఫరా పైపును ఓ వ్యాను ఆదివారం సాయంత్రం ఢీకొనడంతో పైపులైన్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో తాగునీరంతా వృధా అవుతోంది. నగరపాలక సంస్థ సిబ్బంది వచ్చి చూసిన దానికి మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోవడంతో చేసేది లేక అలా ఉండిపోయారు. సోమవారం దీనికి మరమ్మతులు చేసే అవకాశం ఉంది. అప్పటివరకు తాగునీటికి ఇబ్బంది తప్పదు.


